ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి..

జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి

జర్నలిస్టుల సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలి

  • Share this:
    కరీంనగర్ జిల్లా: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వైద్యులు పారిశుద్ధ్య కార్మికులను పోలీసులతో పాటుగా జర్నలిస్టులు కూడా అత్యవసర విభాగంలో సేవలు అందిస్తున్నారని జర్నలిస్టుల సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కోరారు.
    ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ... కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ విస్తరించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకు రావడం కొరకు నిరంతరం జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్రముఖ జర్నలిస్ట్ మనోజ్ యాదవ్ కరోనా మహమ్మారి బారిన పడి సరైన టైంలో వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అందువల్లనే తన ప్రాణాలను సైతం కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరోనా మహమ్మారికి బలైపోయిన మనోజ్ యాదవ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలని అలాగే ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం కోసం జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం కృషి చేస్తున్నారని వారి సేవలు వెలకట్టలేనివని వెంటనే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి మాని ప్రతి నెల జర్నలిస్టులకు గౌరవ వేతనం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    Published by:Venu Gopal
    First published: