THE CORONA AFFECTED INDUSTRIES IN DELHI AND KOLKATA ARE THE EMPLOYEES AND WORKERS WHO LOST THEIR JOBS SNR
మొదలైన కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం..అక్కడ మూతపడుతున్న పరిశ్రమలు,వ్యాపారాలు
Photo Credit: Youtube
Third wave: కరోనా థర్డ్‌వేవ్ దెబ్బకు మళ్లీ పాత పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కోవిడ్ ఆంక్షల కారణంగా ఢిల్లీ, కోల్‌కతాలో చాలా వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడుతున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కోల్పోయి రోడ్డున పరిస్థితి దాపురించింది.
భారత్‌లో చాలా రాష్ట్రాలకు మళ్లీ కష్టకాలం వచ్చింది. అంతా కరోనా పీడ వదిలిపోయిందనుకున్నారు. కానీ ఒమిక్రాన్ omicronకొత్త వేరియంట్‌గా థర్డ్‌వేవ్ (Third wave)రూపంలో విరుచుకుపడటంతో పాజిటివ్ కేసుల (Positive cases)సంఖ్య లక్షలు దాటేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ పరిస్థితి చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను భయపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కొత్త మార్గదర్శకాల్ని అమలు చేస్తుండటంతో చిన్న, చితక ఇండస్ట్రీలు తీవ్రనష్టాల్ని చవిచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గడిచిన రెండ్రోజుల్లో తమ సంస్థల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా రెండ్రోజుల్లో ఐదు కోట్ల రూపాయల (5Crore)నష్టం వాటిల్లిందంటున్నారు. కోవిడ్ ప్రభావం, ప్రభుత్వ ఆంక్షలను (Covid rules)చూస్తుంటే ఢిల్లీ(Delhi) లో పరిశ్రమలు(Industrials)మూతపడే పరేస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓఖ్లా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చరణ్‌జిత్‌సింగ్(Okhla Flatted Factory Entrepreneurs’ Association General Secretary Charanjit Singh).
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం కొత్త ఆంక్షలు అమలు చేయడం వల్ల తమ లాంటి పారిశ్రామికవేత్తలకే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు పలు సామాగ్రి తయారి పరిశ్రమల యజమానులు. ఉన్నపళంగా ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా ..కార్మికులకు పని లేకుండా జీతాలివ్వలేని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికే చాలా మంది పనులు మాని స్వగ్రామాలకు వెళ్తున్నారని..ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్లను నియమించుకోవడం, వారికి కోరినంత జీతాలు ఇవ్వడం మా వల్ల అయ్యే పరిస్థితి లేదంటున్నారు. ఏదైతే ప్రైవేటు కార్యాలయాల్లో 50శాతం సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగించే వెసులుబాటు కల్పించిందో తమకు కూడా అలాగే అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ సర్కార్‌ని పలు చిన్న, చితక పరిశ్రమల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నైట్ కర్ఫ్యూ విధించక ముందు రాత్రి వేళల్లో దాదాపు 180పరిశ్రమల్లో పనులు జరుగుతూ ఉండేవని..ఇప్పుడు 120 పరిశ్రమలు కూడా వస్తువుల ఉత్పత్తిని నిలిపివేశాయంటున్నారు.
మొదటికే మోసం వచ్చేలా ఉంది..
ఒక్క ఢిల్లీలోనే కాదు అటు వెస్ట్ బెంగాల్లో జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో దాదాపు ఏడాదిన్నర కాలం పాటు మూతపడ్డాయంటున్నారు నిర్వాహకులు. ఇప్పుడు ఇప్పుడు థర్డ్‌వేవ్ దెబ్బ తమపై ప్రభావం పడకుండా కోవిడ్ రూల్స్ పాటిస్తూ 50శాతం మందిని అనుమతించే విధంగా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇలాగైతే ఎలా బతికేది..
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు ఉన్నపళంగా పెరగడంతో చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెంట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా సంస్థలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి తప్పదని ఢిల్లీ, కోల్‌కతాలోని చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తల ఆవేదన చూస్తే అర్ధమవుతోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.