Home /News /coronavirus-latest-news /

THE CM ANNOUNCED THAT THE SALARIES OF GOVERNMENT EMPLOYEES WHO HAVE NOT BEEN VACCINATED AGAINST CORONA WILL BE SUSPENDED FROM NEXT MONTH AT SINDH STATE IN PAKISTAN VB

No Salary: కోవిడ్ టీకా వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతం కట్.. అధికారులను ఆదేశించిన సీఎం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

No Salary: రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో టీకాలు వేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని ఆ రాష్ట్రం ప్రకటించింది. నేటి నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలను కూడా పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి వివరాలు ఇలా..

ఇంకా చదవండి ...
    కరోనా మహమ్మారి నుంచి మనల్ని టీకా ఒక్కటే రక్షించగలదని.. ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. టీకా వచ్చిన మొదట్లో కోవిడ్ టీకా వేసుకోవడానికి చాలామంది బయపడ్డారు. వదంతులు నమ్మి టీకా వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమోననే అనుమానంతో దగ్గరకు కూడా రాలేదు. కానీ ప్రభుత్వాలు వారికి విడతల వారీగా అవగాహన కల్పిస్తూ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది టీకా వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. కోవిడ్ టీకా విషయంలో అలసత్వం ప్రదర్శించే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. దానిలో భాగంగానే టీకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు వారికి వచ్చే నెల నుంచి జీతాలు నిలిపివేయనున్నట్లు సీఎం మురాద్అలీ షా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

    కొవిడ్ టీకాలు వేయించుకోనివారికి వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించరాదని ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. ఇంతకు ఇది ఎక్కడ అమలు చేస్తున్నారో చెప్పలేదు కదా.. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో కోవిడ్ టీకా వేసుకోని వారిపై అక్కడి సీఎం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సింధ్ ప్రావిన్సుల కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వైద్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా.. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్ కోసం జూన్ నెల సమయం ఇవ్వాలని సీఎస్‌కు మురాద్‌అలీ షా సూచించారు. కోవిడ్ టీకా ప్రజలకు తప్పనిసరిని ప్రకటించారు.

    పౌరుల భద్రత కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నారు. అంతే కాకుడం జూన్ 7 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండగా రేపటి (జూన్ 5) లోగా ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని సింధ్ సర్కారు ఆదేశించింది. అలాగే వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ తాలూకాకు 5 చొప్పున మొబైల్ వ్యాక్సినేషన్ టీమ్‌లను అదనంగా ఏర్పాటుచేయాలన్నారు. వీటి ద్వారా రోజుకు 60వేల మందికి టీకాలు వేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 9,26,695 మందికి కరోనా సోకగా, 21,022 మంది ప్రాణాలు కోల్పోయారు. సింధ్ రాష్ర్టంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతుండటంతో సీఎం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Corona, Corona Vaccine, Pakistan

    తదుపరి వార్తలు