పది రోజుల్లో నిర్మించిన ఆ హాస్పటల్ మూసివేత.. ఎందుకో తెలుసా..

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో కేవలం పది రోజుల్లోనే వెయ్యి పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించింది.

news18-telugu
Updated: April 15, 2020, 6:11 PM IST
పది రోజుల్లో నిర్మించిన ఆ హాస్పటల్ మూసివేత.. ఎందుకో తెలుసా..
గచ్చిబౌలి ఆస్పత్రి
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చైనాలోని వుహాన్‌లో పది రోజుల్లో నిర్మించిన వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా బుధవారం మూసేసింది. ఈ ఆస్పత్రిని నిర్మించిన పని ముగియడంతో ఆస్పత్రిని మూసివేయడంతో పాటు వైద్యులంతా తిరిగి వెళ్లిపోయారని అధికార పత్రిక షిన్‌హువా తెలిపింది. అసలు కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లోనే పుట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో కేవలం పది రోజుల్లోనే వెయ్యి పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించింది. కరోనా సోకిన వారికి సేవలు అందించేందుకు వేలాది మంది వైద్య సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చారు. ఆ హాస్పిటల్‌లో 42 వేల మంది సిబ్బందికి పైగా ఇక్కడ సేవలు అందించారు. కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ఏప్రిల్ 8న లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. వుహాన్‌లో కరోనా కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడం.. కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఈ ఆస్పత్రిని మూసేశారు.
Published by: Narsimha Badhini
First published: April 15, 2020, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading