Home /News /coronavirus-latest-news /

THE CENTRAL GOVERNMENT HAS RELEASED NEW GUIDELINES FOR CHILDREN IN THE CASE OF CORONA SNR

మీ పిల్లల్లో కరోనా లక్షణాలు ఉన్నాయా..ఇలా చేయండి సరిపోతుంది:కేంద్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

New Guidelines:థర్డ్‌వేవ్‌ ముప్పుతో భయపడిపోతున్న పిలల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కేంద్రం సూచిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించినా, లేకపోయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ పాటించాల్సిన విషయాల్ని కేంద్రం పేర్కొంది.

ఇంకా చదవండి ...
కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పుతో కంగారు పడుతున్న తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వైరస్‌ సోకిందన్న భయం, వస్తే ఏదో ట్రీట్‌మెంట్ చేయాలన్న అయోమయంలో ఏది పడితే అది చేయడం సరికాదని కేంద్రం పరోక్షంగా సూచిస్తోంది. దేశ వ్యాప్తంగా 18ఏళ్లు దాటిన యువతి, యువకులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం (Central government)ప్రస్తుతం చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు సూచనలు చేసింది. అందులో ముఖ్యంగా 18సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు యాంటీ వైరల్(Anti viral),మోనోక్లోనల్‌ యాంటీబాడిస్‌ (Monoclonal antibodies)వాడకూడదని, ఒకవేళ పిల్లవాడిలో వైరస్‌ తీవ్రతను బట్టి వాడినప్పటికి వాటి 10నుంచి 14రోజుల్లో వాటి డోసేజ్‌ (Dosage)తగ్గించాలని సూచించింది. పసి పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు సూచిస్తూ పిల్లల్లో వయసుల వారిగా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ప్రధానంగా పసిపిల్లల నుంచి ఐదేళ్లు (5 years)వయసు పిల్లలకు ఎలాంటి మాస్కులు(No mask)తొడగాల్సిన అవసరం లేదని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 6నుంచి 11ఏళ్ల లోపున్న(6-11 years old)చిన్నారులకు తల్లిదండ్రుల సంరక్షణలో మాస్కులు వాడవచ్చని తెలిపింది. ముఖ్యంగా (12ఏళ్లు పైబడిన(Above 12Years)వాళ్లందరికి మాస్క్‌ తప్పని (Mask must)సరి చేసింది. ఈ వయసులో ఉన్న పిల్లల్లో వైరస్‌ లక్షణాలు లేకపోతే యాంటీ మైక్రోబయాల్స్‌ని సిఫార్సు చేయకూడదని అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. పిల్లల్లో ఏ చిన్న లక్షణాలు కనిపించినా..ఆందోళన చెందడం, పరీక్షలు చేయించడం, మాస్కులు తోడగటం వంటివి చేస్తున్నారు. అలాంటి వాళ్లపై కేస్ స్టడీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ పాజిటివ్ వచ్చినా, స్పల్ప లక్షణాలు కనిపించినా కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

పిల్లల గురించి ఆందోళన వద్దు..
పసివాళ్ల దగ్గర నుంచి టీనేజ్‌ పిల్లల వరకూ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం పెద్దల విషయంలోనూ పలు సూచనలు చేసింది. కరోనా పేషెంట్‌ త్రీ లేయర్‌ మాస్క్‌ను తప్పక ధరించాలని పేర్కొంది. వైరస్‌ లక్షణాలు అసలు లేని వాళ్లు, తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్‌ని వాడకపోవడం మంచిదని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ కరోనా లక్షణాలు స్పష్టంగా కనిపించిన వాళ్లు ఉత్ప్రేరకాల్ని తగిన మోతాదులో సరైన టైమ్‌ వరకు మాత్రమే ఉపయోగించాలంటోంది. కోవిడ్ లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల వరకూ ఎలాంటి ఉత్ప్రేరకాలను వాడకపోవడం మంచిదని సూచించింది. ఒకవేళ కరోనా బారినపడి కోలుకున్న వాళ్లు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇలా చేస్తే సరిపోతుంది..
కరోనా నుంచి బయటపడిన తర్వాత పిల్లలకు పౌష్టికారం అందించాలని..టీకా తీసుకోవాలంటోంది కేంద్రం. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కాగానే శ్వాసకోశ సమస్యలపై ఫోకస్‌పెట్టాలని..పిల్లల్ని సాధారణ జీవినం గడిపేలా దగ్గరుండి పర్యవేక్షించాలని కేంద్ర కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ వచ్చే వరకూ లేదా కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గే వరకూ ఈ మార్గదర్శకాల్ని పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Central governmennt, Corona alert

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు