హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Self lockdown: వామ్మో.. ఆ గ్రామంలో అంతమంది కరోనా బాధితులు ఉన్నారా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,059 మందికి..

Self lockdown: వామ్మో.. ఆ గ్రామంలో అంతమంది కరోనా బాధితులు ఉన్నారా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,059 మందికి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Self lockdown: కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేసింది. మరోసారి అలా జరగకూడదనే ముందు జాగ్రత్తగా ఆ గ్రామంలో లాక్ డౌన్ విధించారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజే జిల్లాలో103 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో మొత్తం 21,059 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌ స‌రిహ‌ద్దు గ్రామాల్లో క‌రోనా తీవ్రత ఎక్కువగా ఉంది.. దీంతో స‌రిహ‌ద్దు గ్రామాలు క‌రోనా క‌ట్ట‌డికి క‌లిసి క‌ట్టుగా క‌ట్టుబాట్లు పెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో లాక్ డౌన్ కు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు చాలా వరకు ఈ గ్రామం నుంచే నమోదవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు లాక్ డౌన్ విధించుకున్నారు. కరోనా బాధితులతో పాటు కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది..

దీంతో క‌రోనా విస్త‌రించాకుండా అడ్డుకోవాలంటే గ్రామంలో స్వ‌చ్చందంగా లాక్ డౌన్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ద్య‌హ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రమే దుకాణ సముదాయాలు, హోటళ్లు , మటన్ , చికెన్ సెంటర్లలో పాటు కల్లు దుకాణాలు తెరిచి ఉంచాలి. మ‌ధ్యాహ్నం 12 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మూసివేయాలని గ్రామస్తులు తీర్మాణం చేసారు. పదిహేను రోజుల వ‌ర‌కు ఉపాధి హామీ పనిలను నిలిపివేసారు. గ్రామంలో ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధరించాల‌ని.. మాస్కు ద‌రించాని వారికి 500 రూపాయ‌ల జ‌రిమాన విదిస్తామ‌ని గ్రామ పెద్ద‌లు నిర్ణ‌యించారు. గ్రామంలో కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు ఈ నిబందధనలు అమలులో ఉంటాయని గ్రామస్తులు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా మూసేసిన దుకాణాలు

గ్రామ సూచిక

బోధన్‌ డివిజన్‌ పరిధి లోని వర్ని, చందూరు, మోస్రా, కోటగిరి, రుద్రూరు, ఎడ పల్లి, రెంజల్‌, నవీపేట మండలాలతో పాటు బోధన్‌ పట్ట ణం, బోధన్‌ మండలాలలో కరోనా కేసులు భారీగా వెలుగుచూశాయి. బోధన్‌ డివిజన్‌ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో మహారాష్ట్ర వాసులతో అధిక సంబంధాలు ఉండడంతో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.


సరిహద్దు మండలాల్లోని వివిధ గ్రామాల ప్ర జలు మహారాష్ట్రకు వెళ్లి వస్తుండడం, మహారాష్ట్ర వాసులు ఇక్కడి గ్రామాలకు వచ్చి వెళ్తుండడం కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది. శుభకార్యాలు, బర్త్‌డే ఫంక్షన్‌ లు, చావులు, పెళ్లిలు, ఇతర అవసరాల నిమిత్తం సాగుతున్న రాకపోకలు కరోనా వ్యాప్తిని పెంచుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డి ఇప్పుడు స్వీయ‌నియంత్ర‌తోనే సాధ్యం.. ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్కు ధరించడం.. సామాజిక దూరం పాటించడం.. ర‌ద్దీగా ఉండే ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా ఉడ‌డం వ‌ల్ల‌నే క‌రోనా క‌ట్టి సాధ్య‌మ‌వుతుంది.. ఆ దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌తో ఉండాల‌ని అధికారులు చెబుతున్నారు.

First published:

Tags: Corona, Covid vaccine, Covid-19, Lock down, Nizamabad, Telangana, Thadbiloli

ఉత్తమ కథలు