Andhra Pradesh: ఒడిశా ఓవరాక్షన్.. ఏపీ నుంచి ఎవరు రాకుండా రోడ్డును తవ్వేసిన అధికారులు

ఏపీ బోర్డర్ రోడ్డును తవ్వేసిని ఒడిశా అధికారులు

కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు ఉంది ఒడిశా అధికారుల వ్యవహారం. ఏపీలో పెరుగుతున్న కేసులు, కర్ఫ్యూను సాకుగా చూపించి.. సరిహద్దు గ్రామాల ప్రజలు తమ రాష్ట్రంలోకి రాకూడదని ఇఫ్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకం బుల్డోజర్ పెట్టి రోడ్డునే తవ్వేశారు.

  • Share this:
    ఏపీ సరిహద్దు గ్రామ ప్రజలతో ఒడిశా దారుణంగా వ్యవహరిస్తోంది. కరోనా పేరుతో  సరిహద్దు గ్రామాల ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలను తమ రాష్ట్రంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్కడికి మాత్రమే పరిమితం అవ్వడం లేదు. సాధారణంగా ఏపీలో భయంకరమైన వైరస్ ఉందని ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీనిపై ఏపీ అధికారులు, ప్రభుత్వం పదేపదే వివరణ ఇస్తున్నాయి. ఏపీలో అంత భయంకరమైన వేరియంట్ ఏదీ లేదని చెబుతున్నాయి. అయినా ఏపీలో విపక్షాలు కానీ.. ఇతర రాష్ట్రాలు కానీ ఆ మాటలు నమ్మడం లేదు. ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వం మాత్రం ఏపీపై కఠిన ఆంక్షలను పెంచుకుంటూ పోతోంది.

    ఇప్పటికే ఏపీలో కరోనా విస్తరణ, కర్ఫ్యూ బూచిని చూపించి ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు పెట్టింది. ఒడిశా నుంచి ఏపీకి రావాల్సిన బస్సులను పూర్తిగా నిలిపివేసింది. మరోవైపు సరిహద్దు గ్రామాల్లో చెక్ పోస్టులు పెట్టి.. ఏపీ నుంచి ఎవరూ తమ రాష్ట్రంలోకి రాకూడదంటూ నిబంధనలు పెట్టింది. ఒకవేళ ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే.. వారు బోర్డర్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని.. అందులో టెంపరేచర్ అధికంగా ఉన్నవారిని అనుమతించేది లేదని తేల్చి చెప్పేసింది.

    అంతేకాదు ఏపీ నుంచి ఎవరైనా తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే 14 రోజులు పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి అత్యవసర పనులపై వెళ్లేవారిని సైతం అనుమతించడం లేదు. మరోవైపు ఏపీలో పగటి కర్ఫ్యూ కారణంగా.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ మెడికల్ ఎమర్జెన్సీకి మినహాయింపులు ఇస్తున్నారు అధికారులు.

    ఏపీ ప్రభుత్వం కావాలనే 12 గంటల తరువాత తమ రాష్ట్ర ప్రజలను అడ్డుకుంటోందనే సాకుతో.. అక్కడి అధికారులు ఓవరాక్షన్ చేశారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఆంక్షలు విధించడం తప్పు కాదు. అన్ని రాష్ట్రాలు అదే చేస్తున్నాయి. నిర్ధిష్ట సమయంలో ఇతర రాష్ట్రాల వాళ్లను అనుమతించడమో.. ముందస్తు అనుమతులు తీసుకున్నవారిని అడ్డుకోకుండా వదిలేయడమో లాంటివి చేస్తున్నాయి. కానీ ఒడిశా అధికారులు మాత్రం.. ఆంధ్రా ప్రాంతం నుంచి రాకపోకలను అడ్డుకునేందుకు రోడ్డును బుల్డోజర్లతో తవ్వేశారు. రోడ్డు తవ్వేస్తే ఎవరూ రారు కదా అని ఆ పని చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం నుంచి ఒడిశాలోకి ఎవరూ రాకుండా ఈ vo చర్యలు తీసుకున్నామని అక్కడి అధికారులే చెబుతున్నారు. ఒడిశా గ్రామాలైన భిన్నాల, బడగాం , అగర్ఖండి గ్రామాల సరిహద్దు రహదారులను పూర్తిగా తవ్వేసి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఒడిశా అధికారుల తీరుపై మండిపడుతున్నారు సరిహద్దు ఏపీ గ్రామ ప్రజలు.
    Published by:Nagesh Paina
    First published: