Corona: పదిశాతం మందికి కరోనా.. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ ప్రకటన!

Corona: మానవాళిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు పదిశాతం మంది కరోనా బారిన పడినట్లు అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్‌ మైఖేల్‌ రయాన్‌ తెలిపారు.

news18-telugu
Updated: October 6, 2020, 7:07 AM IST
Corona: పదిశాతం మందికి కరోనా.. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ ప్రకటన!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవాళిని కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు పదిశాతం మంది కరోనా బారిన పడినట్లు అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్‌ మైఖేల్‌ రయాన్‌ తెలిపారు. అయితే రానున్నది అత్యంత క్లిష్టమైన సమయమన్నారు. ప్రపంచం మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ టాప్‌ ఎమర్జెన్సీ ఎక్స్‌పర్ట్‌ మైక్ ర్యాన్ ఈ వివరాలను వెల్లడించారు. ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల తీవ్రత, మరణాలు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత కరోనా వైరస్‌ ఎలా వ్యాపించిందనే అంశంపై విచారణలో ఆయన స్పందించారు. విచారణలో భాగంగా చైనా వెళ్లే నిపుణులకు సంబంధించిన జాబితాను ఆ దేశ అధికారుల పరిశీలన కోసం సమర్పించినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంచనాలకు అందట్లేదు. అమెరికా, ఇండియా, బ్రెజిల్‌లో వైరస్ ప్రభావం కాస్త తగ్గుతూ... యూరప్ దేశాల్లో మళ్లీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నిన్న కొత్తగా 2,60,721 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,56,91,919కి చేరింది. నిన్న 4172 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 10,45,814కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసుల సంఖ్య 2,68,57,388కి చేరింది. యాక్టివ్ కేసులు 77,89,200కి చేరాయి. సీరియస్ కండీషన్ ఉన్న కేసులు 66,785 ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 1 శాతం ఉన్నాయి. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌ ఆస్పత్రి నుంచి వైట్‌హౌస్‌కి వెళ్లినా... ఆయనకు కరోనా తగ్గలేదనే ప్రచారం జరుగుతోంది. ఆ దేశంలో నిన్న కొత్తగా 39,305 కేసులు రాగా... మొత్తం కేసుల సంఖ్య 76,77,373కి చేరింది. నిన్న 366 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 2,14,977కి చేరింది.

బ్రెజిల్‌లో కొత్తగా 25,210 కేసులొచ్చాయి.. మొత్తం కేసుల సంఖ్య 49,40,499కి పెరిగింది. నిన్న 398 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,46,773కి చేరింది. యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న బ్రిటన్‌లో 12,594 కొత్త కేసులు వచ్చాయి. ఫ్రాన్స్‌లో 5084 పాజిటివ్ కేసులు వచ్చాయి. నెదర్లాండ్స్‌లో 4579 నమోదయ్యాయి. అటు చైనాలో నిన్న కొత్తగా 20 కేసులొచ్చాయి. కరోనా పూర్తిగా పోయిందనుకున్న న్యూజిలాండ్‌లో ప్రస్తుతం 40 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పూర్తిగా కంట్రోల్ అవ్వాలంటే వ్యాక్సిన్ రావాల్సిందేనన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. ఇండియాలో కొత్తగా 74,442 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 66,23,815కి చేరింది. తాజాగా 903 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,02,685కి చేరింది. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.94 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 76,737 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 55,86,703కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 84.3 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,34,427 ఉన్నాయి.
Published by: Nikhil Kumar S
First published: October 6, 2020, 7:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading