Home /News /coronavirus-latest-news /

TELUGU DESHAM PARTY CHIEF NARA CHANDRABABU NAIDU FIRE ON ANDHRA PRADESH GOVERNMENT OVER RISE OF CORONA POSITIVITY RATE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: సీఎంకు దమ్ముంటే ఆ మాట చెప్పమనండి… చంద్రబాబు సవాల్

చంద్రబాబునాయుడు (ఫైల్)

చంద్రబాబునాయుడు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా (Corona Virus) వ్యాప్తి రాజకీయ రగడకు దారితీస్తోంది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తిపై రాజకీయ వైరం ముదురుతోంది. వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో కరోనా పాజిటివిటీ రేట్ ఏకంగా 25.9 శాతానికి పెరిగిందని.., ప్రభుత్వ అసమర్ధతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. కరోనాపై తప్పుడు సమాచారమిచ్చి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని ప్రభుత్వం చెప్పడం అంతా అబద్ధమన్నారు. ప్రభుత్వ జీవోలు ఎక్కడా అమలు కావటం లేదన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని.. అందర్ని కలుపుకు పోయి ప్రజలను కాపాడలని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు హరించి శ్మశానాలకు రాజులుగా ఉండాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడి చర్యల్లో మిగతా రాష్ట్రాలు ముందుటేం.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ముందే ఏపీలో మద్యం షాపులు తెరిచిందని విమర్శించారు.

    థియేటర్లు, రెస్టారెంట్లు సహా అన్నీ తెరవడంతో కరోనా వ్యాప్తి అధికమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా.. మృతదేహాలను మోటార్‌ సైకిల్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యతపైనా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో 104కి కాల్ చేస్తే 3 గంటల్లో బెడ్ ఇస్తామని ప్రకటించారని.. ఇది ఎక్కడైనా ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. వెంటిలేటర్ బెడ్ కు రూ.10వేలు వసూలు చేయాలనే నిబంధన పెట్టినా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో దండుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

    ఇది చదవండి: కరోనా వేళ వీళ్లే ఆత్మబంధువులు… వారి సేవలకు సలాం కొట్టాల్సిందే..!


    రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు తెరవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్నారు. విద్యార్థులకు కరోనా సోకడం వల్ల వారి కుటుంబ సభ్యులకూ ప్రాణహాని ముప్పు పొంచిఉదన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. ఇక దేశమంతా పరీక్షలు వాయిదే వేస్తే.. రాష్ట్రంలో మాత్రం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలు తెరిచి 130 మంది ఉపాధ్యాయులు మృతిచెందడానికి కారణమయ్యారని మండిపడ్డారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టి వారిని విధుల నుంచి తొలగించారన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

    చంద్రబాబు విమర్శలపై డిప్యూటీ సీఎం ఆళ్లనాని మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు బురదజల్లుతున్నారని ఆళ్లనాని విమర్శించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, Chandrababu naidu, Corona virus

    తదుపరి వార్తలు