తెలంగాణలో కరోనా టెస్టులపై కేటీఆర్ కీలక ప్రకటన..

తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను రోజుకు 40,000కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: August 9, 2020, 10:55 PM IST
తెలంగాణలో కరోనా టెస్టులపై కేటీఆర్ కీలక ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షలను భారీగా పెంచనున్నట్టు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 23వేలు టెస్టులు జరుగుతున్నాయి. వీటి సంఖ్యను రోజుకు 40,000కు పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని 1200 కేంద్రాల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కరోనా మరణాల శాతం ఒక్క శాతం కంటే తక్కువగా ఉందని, అదే సమయంలో రికవరీ రేట్ దేశంలోనే ఉత్తమంగా 72 శాతం ఉందని చెప్పారు. అయితే, ఇందులో చేయాల్సింది ఇంకా ఉందన్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండగా, తెలంగాణలో మాత్రం అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలు భారీ ఎత్తున పరీక్షలు చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదనే విమర్శల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాథాన్యతను సంతరించుకున్నాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో 1982 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 79495కి పెరిగింది. అలాగే... 24 గంటల్లో 12 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 627కి చేరింది. మరణాల రేటు దేశంలో 2.03 శాతంగా ఉండగా... తెలంగాణలో అది 0.78 శాతంగా ఉంది.గత 24 గంటల్లో తెలంగాణలో 1669 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 55999కి చేరింది. ఫలితంగా రికవరీ రేటు 70.44 శాతంగా ఉంది. దేశంలో ఇది 68.32 ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22869గా ఉన్నాయి. గత 24 గంటల్లో ప్రభుత్వం 22925 శాంపిల్స్ టెస్ట్ చేసింది. మొత్తం టెస్టుల సంఖ్య 613231కి చేరింది. 1509 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2020, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading