తెలంగాణలో కరోనా సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్‌లో చికిత్స..

తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బందికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని ప్రభుత్వం కోరింది.

news18-telugu
Updated: July 8, 2020, 10:40 PM IST
తెలంగాణలో కరోనా సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్‌లో చికిత్స..
నిమ్స్ ఆస్పత్రి
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బందికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నిమ్స్ డైరెక్టర్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపింది. అలా కరోనా బారిన పడిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులకు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాల్సిందిగా ఆ లేఖలో కోరింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇటీవల కరోనా లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తాన్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఒక్క రోజులోనే రూ. 1.50 లక్షలు బిల్లు వేసిందని ఆమె ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తనను నిర్భంధించారని ఆరోపించారు. ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తానాను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్ సుల్తానా చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించి బాధ్యులుగా తేలితే చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. 

నిమ్స్ డైరెక్టర్‌కు హెల్త్ డిపార్ట్ మెంట్ రాసిన లేఖ


తెలంగాణలో ఈ రోజు కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 29,536కి పెరిగింది. ఇక ఈ రోజు కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలిపి చనిపోయిన వారి సంఖ్య 324కి పెరిగింది. ఈ రోజు నమోదైన కేసులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1590, రంగారెడ్డి-99, మేడ్చెల్-43, కరీంనగర్-14, సంగారెడ్డి-20, మహబూబ్ నగర్-15, నల్లగొండ-31, నిజామాబాద్-19, వరంగల్ రూరల్ - 26, సిరిసిల్ల-13 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ 11, మరికొన్ని జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 17081 బెడ్లు అందుబాటులో ఉంటే, అందులో ప్రస్తుతానికి 1329 మాత్రమే నిండాయని, ఇంకా 15,752 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అందులో 11,333 ఐసోలేషన్ బెడ్లు, 2984 ఆక్సిజన్ బెడ్లు, 1435 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 8, 2020, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading