హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana Covid: తెలంగాణలో కోవిడ్ పై ఈటల కీలక వ్యాఖ్యలు.. త్వరలో 3,010 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు.. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలతో..

Telangana Covid: తెలంగాణలో కోవిడ్ పై ఈటల కీలక వ్యాఖ్యలు.. త్వరలో 3,010 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు.. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలతో..

Telangana Covid: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana Covid: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana Covid: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల తెలిపారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు. వీటితో పాటు మలక్‌పేట ఆసుపత్రి, గోల్కొండ ఆసుపత్రి, వనస్థలిపురం ఆసుపత్రి, అమీర్‌పేట ఆసుపత్రి, నాచరం ఆసుపత్రి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి మరియు ఎర్రగడ్డ ఆసుపత్రిలో కూడా పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని జనరల్ హాస్పిటల్స్ లో 200 చొప్పున బెడ్స్ కలిపి మొత్తం 3,010 ఆక్సిజన్ బెడ్స్ వారం, పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 22 హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను పెట్టుకున్నామని, కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నుంచి ఐదు మిషన్లు ఇస్తే గాంధీ, టిమ్స్, ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్ లో ఏర్పాటు చేశామని వెల్లడించారు.

  నిమ్స్ హాస్పిటల్ లో 200 ఆక్సిజన్ బెడ్స్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, వీఐపీల కోసం ఏర్పాటు చేయబోతున్నట్లు ఈటల వెల్లడించారు. నాచారంలోని 350 ఆక్సిజన్ బెడ్స్ తో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ గా నేటి నుంచి సేవలందించబోతుందని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్ మెంట్ కోసం చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈటల చెప్పారు. రాష్ట్రానికి 400 మెట్రిక్‌ టన్నులకు పైగా ఆక్సిజన్‌ కేటాయింపులున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల ధరలపై కేంద్ర వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రమే బాధ్యత వహించి, అందరికీ టీకా వేయించాలన్నారు. సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మానవ వనరులు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌, పరికరాలు వంటి సమస్యలపై సీఎస్‌ ఆధ్వర్యంలో ఐఏఎస్ ల బృందాన్ని ఏర్పాటు చేశారు.

  ఫార్మా కంపెనీలతో మాట్లాడి 2 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇప్పించాన్నారు. ఇటీవల దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించి, ప్రజలకు అందించిన తొలి రాష్ట్రం తెలంగాణే అని ఈటల గుర్తుచేశారు. ఇప్పటికే 22 ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ నిల్వ సిలిండర్లను ఏర్పాటు చేయగా.. ఒక్కో సిలిండర్‌ కెపాసిటీ 20 కిలోలీటర్లు. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ కింద ఐదు ఆక్సిజన్‌ ఉత్పత్తి మెషిన్లు ఇవ్వగా.. వీటిని గాంధీ లో 29 లక్షల లీటర్లు, టిమ్స్‌ లో 14.50 లక్షల లీటర్లు , ఖమ్మం లో 8.6 లక్షల లీటర్లు , భద్రాచలం 4.5 లక్షల లీటర్లు, కరీంనగర్‌లో 5.76 లక్షల లీటర్లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే.. కేంద్రం 400 టన్నులకు పైబడి కేటాయించిందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కు ఉత్తరం రాస్తే మరో 100 టన్నులు బళ్లారి నుంచి కేటాయించారని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను మందలించాం. కరోనా పేషంట్ల చికిత్సలకు చార్జీలను నిర్ధారిస్తూ గతంలో జారీ చేసిన జీవో ఇప్పటికీ అమల్లో ఉంది. దాని ప్రకారమే వసూలు చేయాలన్నారు.

  ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ల యొక్క వివిధ ధరల గురించి సమీక్షించి, సమాధానం కోరిన విషయం తెలిసిందే. కోవిడ్ -19 పరిస్థితులతో పాటు ఏప్రిల్ 30 వ తేదీలోగా ఉన్నత న్యాయస్థానానికి సమాధానం ఇవ్వాలని సుప్రింకోర్టు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా తెలంగాణలో కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో 10,000 కేసులతో కొత్త మార్క్ ను దాటింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 65,000 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.

  First published:

  Tags: Central Government, Covid cases, Health minister, Minister Etela, More oxygen, Oxygen beds, Telangana

  ఉత్తమ కథలు