తెలంగాణ కరోనా నివారణ చర్యలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుందా? అని రిపోర్టర్లు అడగ్గా.. ప్రస్తుతం బస్సులను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు.

 • Share this:
  తెలంగాణలో తగిన సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య ఒక్క సారిగా తగ్గడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా నివారణ చర్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర బృందం (IMCT) అక్కడ తగినన్ని టెస్టింగ్‌ కిట్లు, పీపీఈలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నట్టు గుర్తించిందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. ఎండ్ టు ఎండ్ ఐటీ డ్యాష్‌ బోర్డు ద్వారా కరోనా పరీక్షల నుంచి డిశ్చార్జి వరకు పేషెంట్లను ట్రాక్ చేస్తున్నారని వినియోగిస్తున్నారని ఆమె చెప్పారు.

  హైదరాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రులు షెల్టర్ హోమ్స్‌ని IMCT సందర్శించింది. గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రిలో అన్ని వసతులు, వైద్యసదుపాయాలు, పరికరాలు ఉన్నాయి. టెస్టుల నుంచి డిశ్చార్జి వరకు అన్ని ప్రొటోకాల్స్ పాటిస్తున్నారు. పేషెంట్లకు ఉచిత వైఫై అందిస్తున్నారు. హుమయూన్ నగర్ కంటైన్‌మెంట్ జోన్‌ను కూడా మా టీం సందర్శించింది. అక్కడ పోలీసులు లాక్‌డౌన్‌లు అపకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందజేస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్లోనూ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
  పుణ్యసలిల శ్రీవాస్తవ, కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి


  వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుందా? అని రిపోర్టర్లు అడగ్గా.. ప్రస్తుతం బస్సులను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. రైళ్లలో వలస కూలీల తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
  Published by:Shiva Kumar Addula
  First published: