తెలంగాణపై కరోనా పంజా... ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

తెలంగాణపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

news18-telugu
Updated: June 6, 2020, 9:49 PM IST
తెలంగాణపై కరోనా పంజా... ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3496కు పెరిగింది. అలాగే, ఒక్కరోజే 10 మంది మృతిచెందారు. ఈరోజు నమోదైన కేసుల్లో 152 కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఈరోజు చనిపోయిన వారితో కలిపి ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 123కు పెరిగింది. ఇక సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కూడా కరోనా బారిన పడ్డారు. మెట్రో రైల్ భవన్‌లో ఆయన ఉంటున్నారు. ఆయన కుమారుడు ఇటీవల ముంబై నుంచి వచ్చినట్టు తెలిసింది. అతడి కుమారుడి ద్వారా కరోనా సోకినట్టు భావిస్తున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం 1550 కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇక 1710 మంది కరోనాకు చికిత్స తీసుకున్న తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్
First published: June 6, 2020, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading