తెలంగాణలో 30వేలకు చేరువలో కరోనా కేసులు.. ఇవాళ 11 మంది మృతి...

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 30వేలకు చేరువలోకి వచ్చేసింది.

news18-telugu
Updated: July 8, 2020, 10:11 PM IST
తెలంగాణలో 30వేలకు చేరువలో కరోనా కేసులు.. ఇవాళ 11 మంది మృతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 30వేలకు చేరువలోకి వచ్చేసింది. ఈ రోజు కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 29,536కి పెరిగింది. ఇక ఈ రోజు కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలిపి చనిపోయిన వారి సంఖ్య 324కి పెరిగింది. ఈ రోజు నమోదైన కేసులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1590, రంగారెడ్డి-99, మేడ్చెల్-43, కరీంనగర్-14, సంగారెడ్డి-20, మహబూబ్ నగర్-15, నల్లగొండ-31, నిజామాబాద్-19, వరంగల్ రూరల్ - 26, సిరిసిల్ల-13 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ 11, మరికొన్ని జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 17081 బెడ్లు అందుబాటులో ఉంటే, అందులో ప్రస్తుతానికి 1329 మాత్రమే నిండాయని, ఇంకా 15,752 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అందులో 11,333 ఐసోలేషన్ బెడ్లు, 2984 ఆక్సిజన్ బెడ్లు, 1435 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.

కరోనాపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ బులెటిన్


కరోనా కట్టడిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే విమర్శలు సరికావని మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరు కేవలం తమ పైశాచిక ఆనందం కోసమే రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో తాము కూడా కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చన్న కేటీఆర్.. కానీ ఇది సరైన సందర్భం కాదని అన్నారు. అందుకే తాము కేంద్రంపై విమర్శలు చేయడంలేదని తెలిపారు. కరోనా మరణాలకంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలే ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ వాఖ్యానించారు. ఇటీవల కరోనా బారిన పడిన డిప్యూటీ స్పీకర్, మాజీమంత్రి పద్మారావుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 8, 2020, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading