తెలంగాణలో రెండోరోజూ 1800 దాటిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లోనే..

ఈ రోజు తెలంగాణలో 1850 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

news18-telugu
Updated: July 4, 2020, 9:00 PM IST
తెలంగాణలో రెండోరోజూ 1800 దాటిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా 1800 కరోనా కేసులు దాటాయి. ఈ రోజు తెలంగాణలో 1850 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 1572 కోవిడ్ 19 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 6427 కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 4577 నెగిటివ్ వచ్చాయి. 1850 పాజిటివ్ వచ్చాయి. 1342 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లా (92) కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ (53), వరంగల్ అర్బన్ (31), కరీంనగర్ (18), నిజామాబాద్ (17), నల్లగొండ (10), సంగారెడ్డి (8), ఖమ్మం (7), వరంగల్ రూరల్ (6), సిద్దిపేట (5), మహబూబ్ నగర్ (5), జగిత్యాల (5), భూపాలపల్లి (4), జనగాం (3), వికారాబాద్ (3), భద్రాద్రి కొత్తగూడెం (3), రాజన్న సిరిసిల్ల (3), గద్వాల (2), నిర్మల్ (1), భువనగిరి (1), మెదక్ జిల్లాలో (1) కరోనా కేసు నమోదైంది. తెలంగాణలో ఇప్పటి వరకు 110545 కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో 83,656 మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. 22,312 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 10,487 కోవిడ్ 19 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. 11,537 మంది డిశ్చార్జ్ అయ్యారు. 288 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading