తెలంగాణలో సడన్‌గా తగ్గిన కరోనా కేసులు..

Telangana Coronavirus | గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: July 11, 2020, 2:25 AM IST
తెలంగాణలో సడన్‌గా తగ్గిన కరోనా కేసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గత కొన్ని రోజులతో పోలిస్తే భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కి పెరిగింది. ఇక ఈ రోజు 8 మంది కరోనా వల్ల చనిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 339కి చేరింది. తెలంగాణలో నేడు 10,354 కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 9076 నెగిటివ్ వచ్చాయి. 1278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో 1013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 762 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత రంగారెడ్డి (171), మేడ్చల్ (85), సంగారెడ్డి (36), కామారెడ్డి (23), మెదక్ (22), ఖమ్మం (18), నల్లగొండ (32), ఆదిలాబాద్ 14, సూర్యాపేట (14) కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి..

తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్


తెలంగాణలో ఇప్పటి వరకు 151109 కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో 118885 మందికి నెగిటివ్ వచ్చింది. 32224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,680 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 19205 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 339 మంది కరోనా కారణంగా చనిపోయారు.

తెలంగాణ కరోనా హెల్త్ బులెటిన్


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పేషెంట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెడ్స్‌లో 90.5శాతం ఖాళీగానే ఉన్నాయి. కేవలం 9.5 శాతం బెడ్స్ మాత్రమే నిండాయి. రాష్ట్రంలో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ మొత్తం కలిపి 17,801 అందుబాటులో ఉన్నాయి. అందులో 1618 నిండాయి. ఇంకా 15,463 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 10, 2020, 10:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading