తెలంగాణలో కొంచెం ఊరట.. తగ్గిన కరోనా కేసులు...

గత 24 గంటల్లో తెలంగాణలో 1178 కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: July 11, 2020, 9:52 PM IST
తెలంగాణలో కొంచెం ఊరట.. తగ్గిన కరోనా కేసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో గత రెండు రోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంచెం ఉపశమనం కల్పిస్తోంది. అంతకు ముందు ప్రతి రోజూ 1800, 1900 పైన నమోదైన కేసులు ఇప్పుడు కొంచెం తగ్గాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 1178 కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 33,402కి పెరిగింది. ఈరోజు 9 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 348గా ఉంది. ఈ రోజు జీహెచ్ఎంసీలో అత్యధికంగా 736 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి (125), మేడ్చల్ (101), సంగారెడ్డి (13), వరంగల్ అర్బన్ (20; కరీంనగర్ (24), పెద్దపల్లి (12), మెదక్ (16), మహబూబ్ నగర్ (12), నల్లగొండ (12), రాజన్న సిరిసిల్ల జిల్లా (24), నిజామాబాద్ (12) కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 10 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కరోనా పేషెంట్ల కోసం పెద్ద ఎత్తున బెడ్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో 17,081 బెడ్లు (ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు కలిపి) అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రస్తుతం 1831 మాత్రమే నిండాయి. ఇంకా 15,250 బెడ్లు ఖాళీగానే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 162171 కరోనా పరీక్షలను నిర్వహించింది. అందులో 128769 మందికి నెగిటివ్ వచ్చింది. 33,402 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం 12,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20,919 మంది డిశ్చార్జ్ అయ్యారు. 348 మంది చనిపోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 11, 2020, 9:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading