తెలంగాణలో రేషన్ కార్డు దారులకు తీపికబురు...

కేంద్రం ఇస్తున్న 5 కేజీల బియ్యంతో పాటు మరో 5 కేజీల బియ్యం అదనంగా ఇవ్వనున్నారు. అంటే ఒక మనిషికి 10 కేజీల బియ్యం రేపటి నుంచి అందించనున్నారు.

news18-telugu
Updated: July 4, 2020, 6:41 PM IST
తెలంగాణలో రేషన్ కార్డు దారులకు తీపికబురు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పేదలకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ వరకు ఉచిత రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలను అందించనున్నారు. అయితే, రేపట్నుంచి తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కాబోతోంది. కేంద్రం ఇస్తున్న 5 కేజీల బియ్యంతో పాటు మరో 5 కేజీల బియ్యం అదనంగా ఇవ్వనున్నారు. అంటే ఒక మనిషికి 10 కేజీల బియ్యం రేపటి నుంచి అందించనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కొక్కరికి నవంబర్ వరకు 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తామని ప్రకటించిందని, కేంద్రం వాటాకు మరో 5 కిలోలు కలిపి ఈనెల నుంచి నవంబరు వరకు మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 87 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని.. ఉచిత బియ్యం పంపిణీతో రాష్ట్రంలో రెండు కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading