భార్య మాటవినడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం.. కాపాడిన సీఐ సీతయ్య

బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకబోయిన యువకుడిని కాపాడిన సీఐ సీతయ్య

వనపర్తి జిల్లాలో భార్యతో గొడవపడి బ్రిడ్జి మీద నుంచి కాలువలోకి దూకబోయిన యువకుడిని సీఐ సీతయ్య కాపాడారు.

 • Share this:
  ఓ యువకుడు భార్య తన మాట వినడం లేదని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. రెప్పపాటులో ఆ యువకుడిని ప్రాణాలతో సురక్షితంగా కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించారు ఆత్మకూర్ సిఐ సీతయ్య. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెవల్లి మండలానికి చెందిన భాస్కర్ కు ఆత్మకూర్ మండలం బలకిష్టపూర్ గ్రామంలోని తన భార్య లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండి పోయింది. భార్యతో గొడవపడిన భాస్కర్ శుక్రవారం మధ్యాహ్నం మాదనపూర్ మండలం గోపన్ పేట, కొత్తపల్లి గ్రామాల్లోని బ్రిడ్జిపై నుంచి నీళ్లలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆత్మకూర్ నుంచి మాదనపూర్ కు వెళుతున్న సిఐ సీతయ్య గమనించి రెప్పపాటులో వాహనం నుంచి దిగి నీళ్లలో దుకాబోయే భాస్కర్‌ను కాపాడి మాదనపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఎసై సైదులును ఆదేశించారు. సీఐ సీతయ్య చాక చక్యంగా వ్యవహరించడంతో ఓ ప్రాణం దక్కింది.

  వృద్ధులను పెట్రోలింగ్ వాహనంలో వారి ఇళ్ల వద్ద దింపిన సీఐ సీతయ్య


  మరోవైపు గ్రామాల్లో బ్యాంకులకు వెళ్లిన వృద్దులు నడుచుకుంటూ వెళుతున్న విషయాన్ని గమనించి తన వాహనంలో వారిని ఎక్కుంచుకుని సింగంపేట, ఖానాపూర్ గ్రామాల్లో వారి గమ్యానికి చేర్చారు. సీఐ సీతయ్య పెద్ద మనసుకు వృద్దులు, మహిళలు అభినందించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: