విద్యార్థులకు రిలీఫ్... వారి కోసం ప్రత్యేక పాస్‌లు

హాస్టల్స్ మూసేస్తుండటంతో ఇంటి వెళ్లే విద్యార్థుల కోసం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

news18-telugu
Updated: March 25, 2020, 3:17 PM IST
విద్యార్థులకు రిలీఫ్... వారి కోసం ప్రత్యేక పాస్‌లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్ డౌన్ కారణంగా ఎవరూ గడప దాటకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులు... హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని వందల కొద్దీ హాస్టల్స్‌లో వేలాదిమంది విద్యార్థులు ఉంటున్నారు. తాజా పరిస్థితి నేపథ్యంలో హాస్టల్స్‌ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే విద్యార్థులు ఊళ్లకు వెళ్లే పరిస్థితులు లేవు. దీనిపై పలువురు విద్యార్థులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. పంజాగుట్ట, రాయదుర్గం, ఎస్‌ఆర్‌నగర్‌, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్లకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకుంటున్నారు. బాలానగర్‌ ఏసీపీ కార్యాలయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులకు పోలీసులు పాసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాము ఇచ్చిన సమయంలోపు విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకోవాలని పోలీసులు వారికి స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్‌ స్ట్రిక్ట్‌గా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్న పోలీసులు... సోషల్ డిస్టెన్స్‌కు తక్కువగా అవకాశం ఉండే హాస్టల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం కూడా ఇందుకు మరో కారణం. అయితే ప్రజారవాణా పూర్తిగా మూతపడటంతో తాము ఎక్కడికి వెళ్లాలని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు టైమ్ ఫ్రేమ్‌తో కూడిన పాస్‌లు జారీ చేసినట్టు సమాచారం.
Published by: Kishore Akkaladevi
First published: March 25, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading