తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరిపై క్రిమినల్ కేసులు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చి వివరాలు అందించకుండా దాచిపెడితే వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

news18-telugu
Updated: April 7, 2020, 1:04 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరిపై క్రిమినల్ కేసులు..
తెలంగాణ ప్రభుత్వం లోగో
  • Share this:
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లే. అక్కడికి వచ్చిన మలేసియా, ఇండోనేషియా వాళ్ల నుంచి మన దేశంలోని ప్రజలకు కరోనా సోకింది. అలా దేశమంతా పాకిందీ వైరస్. అయినా కొందరు వైరస్ సోకిందని గానీ, సోకిన వాళ్ల వివరాలు అందించడానికి ముందుకు రావడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చి వివరాలు అందించకుండా దాచిపెడితే వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలోని తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. టోలిచౌకి సమీపంలోని హకీంపేట మజీదు వద్ద మలేసియాకు చెందిన ఆరుగురిని గుర్తించారు. వారంతా మలేషియా వాసులు టూరిస్ట్‌ వీసాపై ఇండియాకు వచ్చి న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ ఆరుగురు మలేసియా వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. వాళ్లు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌ హకీంపేటకు వచ్చి ఇక్కడ మసీదులో షెల్టర్‌ తీసుకున్నారు. రెండు రోజులుగా ఈ ఆరుగురు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలదాచుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమాచారం ఇవ్వకుండా ఉండటంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోదాలు నిర్వహించారు. వారిపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్‌ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్‌ యాక్ట్‌ కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. హకీంపేట్ మసీదు నిర్వాహకుడిపైనా క్రిమినల్‌ కేసు నమోదైంది.

అటు.. కరీంనగర్ వ‌న్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లోనూ 10 మంది ఇండోనేషియన్లపై కేసులు నమోదయ్యాయి. వారికి సహకరించిన వారిపైనా కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్‌ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 7, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading