చైనా ఎంబీబీఎస్ విద్యార్థికి తెలంగాణ మంత్రి ఫోన్...ఎలా ఉన్నారంటూ...

కుటుంబంతో సెల్ప్ క్వారంటైన్ ఉండాలని, అలాగే ఇతరులతో కాస్త దూరంగా ఉండాలని కోరారు. అలాగే ఇచ్చిన గడువు వరకూ బయటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు.

news18-telugu
Updated: March 26, 2020, 10:47 AM IST
చైనా ఎంబీబీఎస్ విద్యార్థికి తెలంగాణ మంత్రి ఫోన్...ఎలా ఉన్నారంటూ...
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
  • Share this:
చైనా నుంచి వచ్చిన ఎంబీబీఎస్ స్టూడెంట్ తో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఇండియాకి ఎప్పుడొచ్చారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.. కుటుంబంతో సెల్ప్ క్వారంటైన్ ఉండాలని, అలాగే ఇతరులతో కాస్త దూరంగా ఉండాలని కోరారు. అలాగే ఇచ్చిన గడువు వరకూ బయటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలో నిన్న మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మండల కేంద్రంలో నివాసముంటున్న ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆరోగ్యాన్ని వాకబు చేశారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు