Telangana: మహిళా మంత్రికి కరోనా పాజిటివ్.. పక్క రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలో టెన్షన్

Telangana: మహిళా మంత్రికి కరోనా పాజిటివ్.. పక్క రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలో టెన్షన్

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది

  • Share this:
    దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ర్ట మ‌హిళా, శిశు సంక్షేమ‌, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్(Satyavathi Rathod) క‌రోనా బారిన ప‌డ్డారు. సోమవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్ల ఆమె కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు ప్రకటించారు. అయితే ఆమె గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇక, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.

    ఇక, తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో పెరుగుదల ఎక్కువగా లేకపోయినప్పటికీ.. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతుండటంతో ఇక్కడ కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం మహారాష్ట్రలో 10,187 కొత్త కరోనా కేసులు వచ్చాయి. రికవరీలు పోగా... అదనంగా 5,090 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఒక్క రోజులో పెరిగాయి. ఆదివారం 45 మంది చనిపోవడంతో... అక్కడి మొత్తం మరణాల సంఖ్య 52,478కి చేరింది. మరోవైపు దేశంలో అక్కడక్కడ యూకే స్ట్రెయిన్ కేసులు నమోదవుతుండటం కూడా మరింత ఆందోళన కలిగిస్తోంది.

    తెలంగాణలో మొన్న కొత్తగా 158 కేసులు నమోదు కాగా, నిన్న 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, నిన్న రాత్రి 8 గంటల వరకు 19,929 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించడంతో.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1642కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 89,84,552 శాంపిల్స్‌ను పరీక్షించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు