KT RamaRao: కరోనాపై సొంత అనుభవాలు చెప్పిన మంత్రి కేటీఆర్.. బాధితులకు కీలక సలహాలు

KT RamaRao: కరోనాపై సొంత అనుభవాలు చెప్పిన మంత్రి కేటీఆర్.. బాధితులకు కీలక సలహాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KT RamaRao: కరోనా సమయంలో తనకు ఏడు రోజుల పాటు తక్కువ నుంచి అతి తక్కువ డిగ్రీల జ్వరం ఉందని తెలిపారు.

  • Share this:
    ఆస్క్ కేటీఆర్‌ పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి కేటీఆర్... కరోనా బారిన పడిన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను కూడా వివరించారు. కరోనా సమయంలో ఏడు రోజుల పాటు తక్కువ నుంచి అతి తక్కువ డిగ్రీల జ్వరం ఉందని తెలిపారు. దాంతో పాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్‌ఫెక్షన్ కూడా ఉండేదని వెల్లడించారు. తనకు డయాబెటిస్ ఉన్నందువల్ల బ్లడ్ షుగర్ మరియు హైపర్టెషన్ నియంత్రణ కొంత కష్టంగా మారిందన్నారు. అయితే డాక్టర్ల సూచనలతో అధిగమించానని వివరించారు. ప్రస్తుతం తనకు కొంత బలహీనంగా అనిపిస్తోందని..అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.

    ఇక కరోనాను ఎదుర్కొనే వారికి మీరిచ్చే సలహాలు ఏంటనే దానిపై కూడా కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. సొంత వైద్యం పనికిరాదని స్పష్టం చేశారు. కేవలం వైద్యులు, నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలని సూచించారు. మానసికంగా బలంగా ఉండాలని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలా వుండాలన్నది ముందే ఓ ప్లాన్ వేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీలు, వంటికి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని కీలక సూచనలు చేశారు. సాధ్యమైంతవరకు మంచి వ్యాయామం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: