Mask: చేనేత మాస్కులకు కేటీఆర్ ప్రమోషన్... ధర రూ.20 మాత్రమే

Telangana weavers mask | మాస్క్ కొనాలనుకుంటున్నారా? రూ.20 ధరకే రీయూజబుల్ మాస్కుల్ని తయారు చేస్తున్నారు తెలంగాణలోని చేనేత కార్మికులు.

news18-telugu
Updated: May 26, 2020, 5:39 PM IST
Mask: చేనేత మాస్కులకు కేటీఆర్ ప్రమోషన్... ధర రూ.20 మాత్రమే
Mask: చేనేత మాస్కులకు కేటీఆర్ ప్రమోషన్... ధర రూ.20 మాత్రమే (image: @CIPAM_India/twitter)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణలోని చేనేత కార్మికులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. చేనేత మాస్కుల్ని తయారు చేస్తున్నారు. ఇవి రీయూజబుల్ మాస్కులు. అంటే ఈ మాస్కుల్ని ఎన్నిసార్లైనా ఉతికి వాడుకోవచ్చు. ధర కూడా చాలా తక్కువ. డబుల్ లేయర్డ్ మాస్క్ ధర రూ.20 మాత్రమే. పోచంపల్లి ఇక్కత్, కలంకారి ఫ్యాబ్రిక్ మాస్క్ ధర రూ.40. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా సింగిల్ యూజ్ మాస్కులే లభిస్తున్నాయి. అంటే మాస్కును ఒకసారి మాత్రమే వాడిపారెయ్యాల్సి ఉంటుంది. కానీ రోజూ మాస్క్ ధరించాలి కాబట్టి సింగిల్ యూజ్ మాస్కులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే రీయూజబుల్ అంటే మళ్లీ వాడుకోవడానికి వీలుండే మాస్కులు అయితే రోజూ ఉతికి ఎక్కువ రోజులు ఉపయోగించొచ్చు. చేనేత మాస్కులు ధర కూడా తక్కువ కాబట్టి ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ చేనేత మాస్కుల్ని మంత్రి కేటీఆర్ ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశంలోని చేనేత కార్మికులకు చేయూతగా నిలవాలని పిలుపునిస్తున్నారు.


త్వరలో ఈ మాస్కులు అన్ని రత్నదీప్ సూపర్ మార్కెట్లలో లభించనున్నాయి. ఈ మాస్కుల్ని హోమ్ డెలివరీ కూడా చేస్తారు. కనీసం 100 మాస్కుల్ని ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కొఆపరేటీవ్ సొసైటీ ఎక్స్‌పోర్ట్ షోరూమ్‌లో కూడా ఈ మాస్కులు కొనొచ్చు. నాంపల్లిలోనే చేనేత భవన్‌లో ఈ షోరూమ్ ఉంది. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షోరూమ్ తెరిచి ఉంటుంది. ఈ మాస్కుల కోసం డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ జే.కళింగ రెడ్డిని 85006 56556 నెంబర్‌లో సంప్రదించొచ్చు.


 

ఇవి కూడా చదవండి:

COVID-19: మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే

Job Loss: ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పొందండి ఇలా

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
First published: May 26, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading