Covid-19: కరోనావైరస్ సమాచారంతో వాట్సప్ ఛాట్‌బాట్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

Covid 19 WhatsApp Chatbot | కరోనా వైరస్‌పై మీకు ఏవైనా సందేహాలున్నాయా? వాటికి సరైన సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరోనావైరస్‌పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవాలా? ఈ సమాచారాన్ని మీ వాట్సప్‌లోనే తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: April 6, 2020, 6:16 PM IST
Covid-19: కరోనావైరస్ సమాచారంతో వాట్సప్ ఛాట్‌బాట్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
వాట్సప్ ఛాట్‌బాట్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్
  • Share this:
కరోనావైరస్‌పై పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటోండి. కరోనావైరస్‌కు సంబంధించిన సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ ఛాట్‌బాట్‌ను ప్రారంభించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఛాట్‌బాట్‌ను ఆవిష్కరించారు. 9000658658 నెంబర్‌పై TS Gov Covid Info పేరుతో ఈ వాట్సప్ ఛాట్‌బాట్ పనిచేస్తుంది. కోవిడ్-19 పై సమాచారంతో పాటు నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ ఎస్‌బీ టెక్నాలజీస్, వాట్సాప్ అధికారిక వ్యాపార పరిష్కారాల భాగస్వామి మెసెంజర్ పీపుల్‌తో కలిసి తెలంగాణ ఐటీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ చాట్ బాట్‌ను రూపొందించాయి.
కోవిడ్-19కి సంబంధించి ప్రజలకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే వాట్సాప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.



కరోనా వైరస్‌పై పోరుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అన్ని వేదికలను ఉపయోగించుకుంటోంది. కరోనా మహమ్మారిపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో ఈ నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించింది. లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలి. అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలి.
కేటీఆర్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి


మీరు ఈ చాట్ బాట్‌ను ఉపయోగించాలంటే +919000658658 నెంబర్‌ను సేవ్ చేసుకొని వాట్సప్ ద్వారా Hi లేదా Hello లేదా Covid అని టైప్ చేయాలి. లేదా https://wa.me/919000658658?text=Hi లింక్‌ను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్లిక్ చేయాలి.
తెలంగాణ వాట్సాప్ చాట్ బాట్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు, సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.in మెయిల్ ఐడీకి ఇ-మెయిల్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తే ఎంత నష్టమంటే...

Lockdown: మొబైల్ యాప్స్‌తో అప్పు తీసుకోవచ్చు... కానీ ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: April 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading