Home /News /coronavirus-latest-news /

TELANGANA MINISTER HARISH RAO PRAISES GANDHI HOSPITAL DOCTORS SK

వైద్యులు.. కనిపించే దేవుళ్లు.. మంత్రి హరీష్ రావు ప్రశంసలు

కరోనా రావాలని.. ఎవరూ కోరుకోరని, రాకుండా అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించారు. కరోనా వస్తే చేయరాని నేరం, ఘోరం చేసినట్లు, సామాజికంగా బహిష్కరించడం సరికాదని, కరోనా వచ్చిన వారిని దగ్గరికీ రానివ్వక పోవడం, వారిని మాట్లాడించక పోవడం.. దూరంగా పెట్టడం సరికాదని తెలిపారు.

కరోనా రావాలని.. ఎవరూ కోరుకోరని, రాకుండా అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించారు. కరోనా వస్తే చేయరాని నేరం, ఘోరం చేసినట్లు, సామాజికంగా బహిష్కరించడం సరికాదని, కరోనా వచ్చిన వారిని దగ్గరికీ రానివ్వక పోవడం, వారిని మాట్లాడించక పోవడం.. దూరంగా పెట్టడం సరికాదని తెలిపారు.

గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితురాలు ప్రసవించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన గర్భిణీకి గాంధీ ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ చేశారు.

    గాంధీ ఆస్పత్రి వైద్యులపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించారు. కనిపించే దేవుళ్లు అంటూ కొనియాడారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితురాలు ప్రసవించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన గర్భిణీకి గాంధీ ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ చేశారు. ఆమె పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వైద్యులపై ప్రశంసలు కురిపించారు హరీష్ రావు. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించారని ఆయన అన్నారు.

    కరోన సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన మన గాంధీ హాస్పిటల్ వైధ్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
    హరీష్ రావు, మంత్రి


    ఐతే తల్లి నుంచి బిడ్డకు సోకిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో శిశువుకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు వైద్యులు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో తెలంగాణ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కు చేరింది. మొత్తం బాధితుల్లో 727 మంది బాధితులు కోరుకోగా.. ఇప్పటి వరకు 29 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 376 యాక్టివ్ కేసులున్నాయి. వారంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Gandhi hospital, Harish Rao, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు