కరోనాను పట్టించుకోని ప్రజలు.. తెలంగాణ మంత్రి తీవ్ర ఆవేదన..

కరోనా అంటే భయం లేకుండా పోతోంది కొందరు ప్రజలకు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా తమకేం కాదులే అన్నట్లు.. వ్యవహరిస్తున్నారు.

news18-telugu
Updated: March 26, 2020, 10:23 AM IST
కరోనాను పట్టించుకోని ప్రజలు.. తెలంగాణ మంత్రి తీవ్ర ఆవేదన..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా అంటే భయం లేకుండా పోతోంది కొందరు ప్రజలకు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా తమకేం కాదులే అన్నట్లు.. వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలైతే కొందరు స్వస్థలాలకు వెళ్తామంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. లాక్‌డౌన్ విధించింది ఇంటికి వెళ్లడానికి కాదు.. ఇంటి నుంచి బయటికి రావొద్దనడానికి అంటూ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో వేగంగా కరోనా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 41 కరోనా కేసులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా కరీంనగర్‌‌ను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రబోధకుల కారణంగా కరోనా జిల్లా తలుపు తట్టింది. అయితే, కరోనా వచ్చిందని తెలిసినా నగర ప్రజలు పట్టించుకోకుండా బయట తిరగడంతో మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఎంత చేసినా ఫలితం ఏముంటుందని.. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనాను అడ్డుకోలేమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నగరంలోని పలు మార్కెట్లను పరిశీలించిన ఆయన.. ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాగే వ్యవహరిస్తే వైరస్ నియంత్రణ కష్టం అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. కరోనాను తేలికగా తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్కెట్లన్నీ మూసేసి మార్కెట్ యార్డులో ఒకే చోట కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading