Home /News /coronavirus-latest-news /

Telagnana: కరోనా టెస్టులపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Telagnana: కరోనా టెస్టులపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనాను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

    కరోనా టెస్టులపై తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ అనే వస్తోందని అన్నారు. టెస్టుల ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ ఆగవద్దని ఆయన ప్రజలకు సూచించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని అన్నారు. కరోనా విషయంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదని, బెడ్స్, టీకాలు, మందులూ అన్నీ అందుబాటులోనే ఉన్నాయని ఈటల అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని, 80 టన్నుల ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆస్పత్రులు బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి ఈటల కోరారు. కరోనాను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

    ఇదిలా ఉంటే ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోంది. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు. కరోనా వైద్యం విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Covid-19, Etela rajender, Telangana

    తదుపరి వార్తలు