గాంధీ ఆసుపత్రిపై మంత్రి ఈటల కీలక సూచనలు

గాంధీ ఆసుపత్రి, ఈటల రాజేందర్

గాంధీ హాస్పిటల్‌ను పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్‌గా ప్రకటించామని... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యక్తులందరికీ ఇక్కడే చికిత్స అందిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు.

 • Share this:
  గాంధీ ఆసుపత్రిని మొత్తం 6 యూనిట్స్‌గా విభజించాలని... ప్రతి యూనిట్‌కి ఒక ప్రొఫెసర్‌ను ఇంచార్జ్‌గా నియమించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. అన్నీ యూనిట్‌లలో సమానంగా పేషంట్స్ ఉండేలా చూడాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావును ఆదేశించారు. గాంధీ హాస్పిటల్‌ను పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్‌గా ప్రకటించామని... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యక్తులందరికీ ఇక్కడే చికిత్స అందిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల అడ్మిషన్, ట్రీట్మెంట్, టెస్టులు,డిశ్చార్జ్‌లపై కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షించారు.

  ఒక పేషంట్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, 14 రోజులు ఎప్పుడు పూర్తి అయ్యింది, అయ్యాక మొదటి పరీక్ష ఏ రోజు చేయాలి, రెండవ పరీక్ష ఎప్పుడు చేయాలి, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది అనే పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంచాలని మంత్రి ఈటల రాజేందర్ ఆస్పత్రి అధికారులకు తెలిపారు. ప్రతి కరోనా పషెంట్ ను ఉదయం సాయంత్రం పరీక్ష చేయాలని, డయాబెటిస్, బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

  చిన్న పిల్లల తల్లిదండ్రులు హాస్పిటల్‌లో ఉంటే వారి దగ్గరే ఉంచాలని సూచించిన మంత్రి ఈటల... పీడియాట్రీషియన్ల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిచాలని తెలిపారు. గాంధీలో కేవలం కరోనా పాజిటివ్ పేషంట్లు మాత్రమే ఉన్నారు కాబట్టి వైరస్ వ్యాప్తి జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా డాక్టర్‌లు, నర్సులు, పారామెడీకల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది విధిగా పీపీఈ కిట్స్ ధరించాలని కోరారు.
  Published by:Kishore Akkaladevi
  First published: