తెలంగాణలో నాలుగు కరోనా కేసులు: మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

కరోనా లక్షణాలు ఉన్నవారిని గాంధీకి తరలిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీలో పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు చేస్తామని అన్నారు.

  • Share this:
    తెలంగాణలో ప్రస్తుతం నలుగురికి కరోనా పాజిటివ్ ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గాంధీకి తరలిస్తున్నామని ఆయన వివరించారు. గాంధీలో పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వచ్చిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాల్లోకి వచ్చే అన్ని మార్గాల్లో కరోనా టెస్టులు చేస్తామని ఆయన తెలిపారు. ఎయిర్ పోర్టులో 66 వేల మంది టెస్టులు చేశామని అన్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో ఒకరు ఖమ్మం, ఇద్దరు హైదరాబాద్, ఒకరు విదేశీయులని ఈటల రాజేందర్ తెలిపారు.

    ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్న నలుగురితో కలిసిన వారిలో చాలామందికి టెస్టులు నిర్వహించామని ఈటల రాజేందర్ అన్నారు. వారిలో ఎవరికి పాజిటివ్ రాలేదని వివరించారు. ప్రస్తుతం క్వారంటైన్‌, ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న చాలామంది అనుమానితులు మాత్రమే అని మంత్రి ఈటల స్పష్టం చేశారు. కొన్ని చోట్ల వాటిని తొలగించాలని కొందరు ధర్నాలు చేస్తున్నారని... అది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఈటల వెల్లడించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: