హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్‌లు కరోనా కేసులను వ్యాపార కోణంలో చూడవద్దని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

  దేశంలో 60 శాతం కేసులు మహారాష్ట్ర నుండే నమోదు అవుతున్నాయని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. లక్షణాలు లేకుండా చాలా కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. రాపిడ్ టెస్ట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ట్రేసింగ్ వేగవంతం అయ్యిందని మంత్రి ఈటల తెలిపారు. దీంతో మరణాల శాతం తగ్గిందని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారని ఈటల వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 56 వేల మందికి వాక్సిన్ ఇస్తున్నామని... భవిష్యత్తులో 1.5 లక్షల మందికి ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా పరీక్షలను కూడా పెంచుతామని.. అవసరమైతే రోజుకి లక్ష మందికి పరీక్షలు చేస్తామని అన్నారు.

  అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు కొనసాగిస్తూనే కరోనా సేవలు కూడా అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లీవ్ లేకుండా 24 గంటలు అందుబాటులో ఉన్నామని.. 33 జిల్లాల్లో ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కోవిద్ చికిత్స అందుబాటులో ఉందని.. సరిహద్దు జిల్లాల వారందరికీ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల తెలిపారు.

  11 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని ఆయన కోరారు. ప్రైవేట్ హాస్పిటల్‌లు కరోనా కేసులను వ్యాపార కోణంలో చూడవద్దని అన్నారు. కరోనా పేషంట్ వస్తే వారి బంధువులు భయపడకుండా వచ్చి పలకరించి పోతున్నారని.. అయితే జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని.. కరోనా ఒక మామూలు రోగమని ఈటల రాజేందర్ తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Etela rajender

  ఉత్తమ కథలు