అలా చేయాల్సిందే... 15 రోజులు కీలకమన్న మంత్రి ఈటల

మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

జనతా కర్ఫ్యూను అంతా విజయవంతం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

  • Share this:
    కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న సమస్య అని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భారతదేశంలోకి ఈ వైరస్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని అన్నారు. దీనిని నివారించే బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలపై కూడా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇస్తున్న సూచనలు తూచ తప్పకుండా పాటించాలని కోరుతున్నామని మంత్రి విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్‌మెంట్లలో, గ్రామాలలో అందరికీ అందరూ ఈ కరోనా వైరస్ నివారించడంలో తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన పద్ధతులు పాటించాలని కోరుతున్నట్టు వివరించారు.

    రేపటి జనతా కర్ఫ్యూను అంతా విజయవంతం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రజలకు పూర్తి అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. కరోనా వైరస్‌ను నివారించడానికి ఏకైక మార్గం వైరస్ వచ్చిన వారితో కలవకుండా ఉండటమే అని... అప్పుడే తెలంగాణ రక్షించబడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలందరూ వచ్చే 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి వైరస్ సోకిన వారితో కలవకుండా ఉండాలని కోరారు. ఈ నియమాన్ని పాటిస్తే... ఈ వైరస్ బారి నుంచి అంతా సురక్షితంగా ఉండొచ్చని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: