Telangana: వ్యాక్సిన్ వృధాపై స్పందించిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్

Telangana: వ్యాక్సిన్ వృధాపై స్పందించిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

CoronaVirus Vaccine: తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా అవుతోందని అన్నారు. దీనిపై తమ దగ్గర సమాచారం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

  • Share this:
    దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్టేజీ అవుతోందన్న కేంద్రం.. ఆ జాబితాలో ఏపీ, తెలంగాణలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజీ జరగడం లేదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో పది శాతానికిపైగా వ్యాక్సిన్ వేస్ట్ అవుతోందన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. అంతకముందు కరోనా కేసులు పెరుగుతుండటంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ.. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు.

    ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేస్టేజీ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా అవుతోందని అన్నారు. దీనిపై తమ దగ్గర సమాచారం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ఎందుకు 10 శాతం వరకు వృధా అవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వృధాను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మోదీ స్పష్టం చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలని.. వ్యాక్సిన్ వేస్టేజీని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు.

    ఇదిలా ఉంటే దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. సోమవారం దేశవ్యాప్తంగా 26291 కొత్త కేసులు నమోదు కాగా.. నిన్న 24492 కేసులు నమోదయ్యాయి. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్ వ్యాప్తి చెందడానికి గల కారణాలను ఆరా తీశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సమాచారం తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి సేకరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు