కేంద్రం సహకరించలేదు.. బీజేపీపై మంత్రి ఈటల తీవ్ర ఆగ్రహం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

బీజేపీ వర్చువల్ ర్యాలీ మీటింగ్‌లో జేపీ నడ్డాపై తెలంగాణ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. పార్టీ అధ్యక్షుడిగా కాకుండా గల్లీలీడర్‌లా తీవ్ర విమర్శలు గుప్పించారు. తమపై ఆరోపణలు చేసేముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడాలని విరుచుకుపడ్డారు మంత్రి ఈటల.

 • Share this:
  కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదని మంత్రి ఈటల అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ.. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. కరోనా కట్టడితో తెలంగాణ ప్రభుత్వం పనితీరును కేంద్ర బృందాలే ప్రశంసించాయన్న ఆయన.. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కరోనా టెస్టులు-మరణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై జేపీ నడ్డా పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. పార్టీ అధ్యక్షుడిగా కాకుండా గల్లీలీడర్‌లా తీవ్ర విమర్శలు గుప్పించారు. తమపై ఆరోపణలు చేసేముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడాలని విరుచుకుపడ్డారు మంత్రి ఈటల.

  తెలంగాణ ప్రభుత్వంపై జేపీ నడ్డా ఆరోపణలు సరికావు. జాతీయస్థాయి నాయకుడిలా కాకుండా గల్లీ లీడర్‌లా మాట్లాడారు. కరోనా అనేది ప్రపంచ సమస్య. అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. గుజరాత్‌లో కరోనా తీవ్రతపై ప్రధాని బాధ్యత వహిస్తారా? కరోనాపై అన్ని రాష్ట్రాల కన్నా ముందే అప్రమత్తమయ్యాం. లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేశాం. తెలంగాణ ప్రభుత్వం చర్యలపై కేంద్ర బృందాలు హర్షం వ్యక్తం చేశాయి. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది.
  టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చిల్లరమల్లర ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీ-పార్లమెంట్ కి కూతవేటు దూరంలో మీరు పట్టించుకోకపోతే, మర్కజ్ కేసులు ట్రేస్ చేసి బయటపెట్టింది తెలంగాణ. కరోనా కట్టడిలో సఫలం అయిన రాష్ట్రం తెలంగాణ.
  మంత్రి ఈటల రాజేందర్


  కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకించలేదని ఆరోపించారు మంత్రి ఈటల. కేంద్రం సహకరించలేదు. పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్ 95 మాస్క్‌లు ఇవ్వకపోయినా, తామే తెచ్చుకున్నామని ఆయన చెప్పారు. తాము 1000 వెంటిలేటర్లు అడిగితే 50 మాత్రమే ఇచ్చారని..తెలంగాణకు రావాల్సిన వాటిని మోదీ ఆదేశాలతో బెంగాల్‌కు మళ్లించారని ఆరోపించారు. ఈటల. కేంద్రం నిధుల ఊరికే ఇవ్వడం లేదని... రాష్ట్రాల నుంచి పన్నులు వెళ్తున్నాయని మండిపడ్డారు ఆరోగ్యశాఖమంత్రి. ICMR ఎన్ని సార్లు మార్గదర్శకాలను మారుస్తుందని ఈటల ప్రశ్నించారు.
  First published: