కరోనా బారిన పడిన తెలంగాణ జర్నలిస్టులకు రూ.20వేల సాయం

ప్రతీకాత్మక చిత్రం

గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలోని లో క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు కూడా రూ.10 వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు.

  • Share this:
    కరోనా మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదన్నారు. శనివారం ఢిల్లీలో కరోనా భారిన పడిన జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటామని, ఈ మేరకు వారితో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, ఖర్చుల నిమిత్తం వారి బ్యాంకు ఖాతాలకు వెంటనే రూ. 20 వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలోని లో క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు కూడా రూ.10 వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన ఢిల్లీ జర్నలిస్ట్ చికిత్సకు సంబంధిత టీవీ యాజమాన్యం ఒక లక్ష రూపాయలను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని, ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని అల్లం నారాయణ సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: