Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్

Telangana Jobs | కరోనా వైరస్‌పై పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య సిబ్బందిని నియమించుకోనుంది.

news18-telugu
Updated: March 31, 2020, 1:15 PM IST
Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్
Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా పోరాడుతూనే ఉంది. పరిస్థితి అదుపు తప్పినా కంట్రోల్ చేసేందుకు సంసిద్ధంగా ఉంది. అందుకే ముందస్తుగా వైద్య సిబ్బందిని నియమించుకుంటోంది. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో ఉన్నవారితో పాటు రిటైర్ అయిన మెడికల్ సిబ్బంది కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 3 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తులో వెల్లడించిన జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత నియమించుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు http://health.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

Telangana Jobs: వైద్య సిబ్బందికి ఇచ్చే వేతనాల వివరాలు ఇవే...



మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)- రూ.1,00,000
మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్)- రూ.40,000
మెడికల్ ఆఫీసర్ (ఆయుష్)- రూ.35,000
స్టాఫ్ నర్స్- రూ.23,000
ల్యాబ్ టెక్నీషియన్- రూ.17,000కరోనావైరస్ విధులు నిర్వహించేవారికి స్పెషల్ అలవెన్స్ ఇచ్చే అవకాశముంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ... ఖాళీ సమయంలో పూర్తి చేయండి
Published by: Santhosh Kumar S
First published: March 30, 2020, 9:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading