Covid 19: ఇంటర్ బోర్డులో కరోనా కలకలం... రీకౌంటింగ్ ఎలా?

Telangana Intermediate Board | తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇద్దరు ఉన్నతాధికారులకు కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలడం కలకలం సృష్టిస్తోంది.

news18-telugu
Updated: June 24, 2020, 1:49 PM IST
Covid 19: ఇంటర్ బోర్డులో కరోనా కలకలం... రీకౌంటింగ్ ఎలా?
Covid 19: ఇంటర్ బోర్డులో కరోనా కలకలం... రీకౌంటింగ్ ఎలా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు, అధ్యాపకులకు, వ్యాల్యుయేషన్‌లో పాల్గొన్నవారికి కరోనా వైరస్ సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని ఫలితాలు విడుదల చేసే రోజున మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఇంటర్ బోర్డు ప్రకటించింది. కానీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టించడం ఉద్యోగుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉన్నతాధికారులకు కరోనా పాజిటీవ్ అని నిర్థారణ జరిగింది. ఒకరు జాయింట్ డైరెక్టర్ కాగా మరొకరు డిప్యూటీ డైరెక్టర్. ఇద్దరు ఉన్నతాధికారులు కరోనా బారినపడటం కలకలం రేపుతోంది. అంతేకాదు... ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సైతం కరోనా లక్షణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటం భయాందోళనల్ని పెంచుతోంది. ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ భయాలు పెరిగిపోవడంతో కార్యాలయానికి సందర్శకులను అనుమతించట్లేదు అధికారులు. మార్కులపై, ఇంటర్ ఫలితాలపై లాంటి సందేహాలు ఉన్నా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

కంప్లైంట్స్ స్వీకరించేందుకు ఇప్పటికే 'టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ గ్రీవియెన్స్ రిడ్రసల్ సిస్టమ్-BIGRS' ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు http://bigrs.telangana.gov.in/ వెబ్‌సైట్ లేదా BIGRS యాప్‌లో కంప్లైంట్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు విద్యార్థుల నుంచి ఇంటర్ మార్కుల రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు 2020 జూన్ 24న అంటే ఇవాళ ముగుస్తుంది. చివరి తేదీ పొడిగింపు కూడా ఉండదని ఇప్పటికే ప్రకటించింది ఇంటర్ బోర్డు. కానీ ప్రస్తుతం ఇంటర్ బోర్డులో కరోనా వైరస్ కలకలం రేపుతుండటం రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌పైన ప్రభావం చూపించడం ఖాయమని భావిస్తున్నారు.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TS Inter Results 2020: మార్కులు తక్కువగా వస్తే... రీకౌంటింగ్ చేయించండి ఇలా

TS Inter Results 2020: మీ ఇంటర్ ఫలితాలపై డౌట్స్ ఉన్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి
First published: June 24, 2020, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading