TELANGANA HIGHCOURT SLAMS TS GOVT OVER CORONA TESTS SK
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. 'ఆదేశాలు అమలు చేయరా'..
హైకోర్టు, కేసీఆర్
ప్రజలకు కరోనా ర్యాండమ్ టెస్టులు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడం వల్లే డాక్టర్లూ కరోనా సోకిందని మొట్టికాయలు వేసింది.
తెలంగాణలో తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నారని ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలున్నాయి. లెక్కల్లోనూ గందరగోళం ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లెక్కల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తమ ఆదేశాలు అమలు చేయడం లేదని.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని, మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాల అమలు కావడం లేదని మండిపడింది. కరోనా గణాంకాలను ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేయడం లేదన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఐతే తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని..విచారణ జరగాల్సి ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అటు ప్రజలకు కరోనా ర్యాండమ్ టెస్టులు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడం వల్లే డాక్టర్లూ కరోనా సోకిందని మొట్టికాయలు వేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన గణాంకాలను దాచితే దాని ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కరోనా కేసుల గణాంకాలను పత్రికలు, వెబ్సైట్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజల్లోనూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. దీనిపై ఈ నెల 18 లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.