తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కరోనా టెస్ట్‌లు ఎందుకు చేయరు?

జులై 17న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, దానిపై సంతృప్తి చెందకపోతే... జూన్ 26న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: July 1, 2020, 3:50 PM IST
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కరోనా టెస్ట్‌లు ఎందుకు చేయరు?
హైకోర్టు, కేసీఆర్
  • Share this:
తెలంగాణలో కరోనా పరీక్షలు, రోగులకు అందుతున్నచికిత్స తీరుపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో పెద్ద మొత్తంలో టెస్ట్‌లు చేస్తున్నప్పటికీ తెలంగాణలో చేయడం లేదని విపక్షలు మండిపడుతున్నాయి. అంతేకాదు ఈ అంశంలో హైకోర్టు సైతం పలు మార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. కరోనా పరీక్షలు చేయకుండా.. జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న ఎంత మందికి పరీక్షలు చేశారు? ఆ రోజు హైదరాబాద్‌లో టెస్ట్‌లు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది.



కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అసలు రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలి. కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు, గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలి. కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను కోర్టుకు సమర్పించండి.
తెలంగాణ హైకోర్టు


గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు..10 నిమిషాల్లో రిపోర్టులు వచ్చే పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 17న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, దానిపై సంతృప్తి చెందకపోతే... జూన్ 26న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 16,339 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,294 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. 260 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,785 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలో 88,563 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఐతే పక్క రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
First published: July 1, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading