Home /News /coronavirus-latest-news /

TELANGANA HIGH COURT UNHAPPY WITH STATE GOVERNMENT REGARING COVID 19 CONTROL MEASURES AK

Telangana: కరోనా కట్టడి.. ఇప్పుడేం చేయలేరా ? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: లైసెన్స్ రద్దు చేసిన ఆస్పత్రులు బాధితులకు సొమ్ము తిరిగి ఇచ్చారా ? అని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు నిలదీసింది.

    కరోనా కట్టడి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల అంశంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇచ్చిన నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము ఇచ్చిన చాలా ఆదేశాలు పాటించలేదని పేర్కొంది. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి సరైన సమాధానం లేదని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు వివరణ ఇవ్వాలని సూచించింది. మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారులకు కరోనా సోకిందనే విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

    దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని హైకోర్టు.. మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. అన్ని భవిష్యత్తులోనే చేస్తారా ? ఇప్పుడేం చేయలేరా ? అని కామెంట్ చేసింది. లైసెన్స్ రద్దు చేసిన ఆస్పత్రులు బాధితులకు సొమ్ము తిరిగి ఇచ్చారా ? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రుల్లో ఫీజులు చెల్లిస్తున్నారని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సమయం అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. మరోవైపు రేపటి విచారణకు ఉన్నతాధికారులు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Covid-19, Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు