ఇదేం పద్ధతి.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్

జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అధికారులు అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: July 27, 2020, 12:41 PM IST
ఇదేం పద్ధతి.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
హైకోర్టు, కేసీఆర్
  • Share this:
కరోనా కేసుల్లో తమ ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అధికారులు అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయడం కష్టమైతే ఎందుకో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని హైకోర్టు ఆక్షేపించింది. కరోనా విషయంలో ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడుగుతామని వ్యాఖ్యానించింది. కరోనా కేసులన్నింటిపై విచారణ రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణలో కరోనా టెస్టులు ఎక్కువగా ఎందుకు చేయడం లేదని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.. ఈ అంశంపై ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందుతున్న తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే పదే పదే హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇలాంటి చర్యలు సరికావని వ్యాఖ్యానించింది.
Published by: Kishore Akkaladevi
First published: July 27, 2020, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading