ఐపీఎల్ తరహాలో కరోనా సమాచారం.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సర్కార్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది.

news18-telugu
Updated: July 28, 2020, 3:58 PM IST
ఐపీఎల్ తరహాలో కరోనా సమాచారం.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
తెలంగాణ హైకోర్టు
  • Share this:
ఇకపై పత్రికల్లో ప్రతి రోజు న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు కరోనా సమాచారం అందించాలని ఆదేశించింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు ఏ విధంగా పట్టిక వేసి హెడ్ లైన్స్‌లో చూపుతారో అదే తరహాలో కేసుల వివరాలు చూపాలని తెలంగాణ హైకోర్టుకు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా అంశంపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని తాము చెప్పినా ఎందుకు పాటించడం లేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి... ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి.. ఎంత మంది చికిత్స పొందుతున్నారనే సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

అంతకుముందు తెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టులో విచారణ వాడీవేడీగా సాగింది. కేసు విచారణకు సంబంధించి కోర్టుకు హాజరైన సీఎస్ సోమేష్ కుమార్, వైద్యాధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సర్కార్‌ను నిలదీసింది. అయితే ఇప్పటికే పలు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామని సీఎస్ కోర్టుకు వివరించారు. కరోనాపై ప్రభుత్వం ఎందుకు విస్తృత ప్రచారం చేపట్టడం లేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కలెక్టర్, పోలీసులు, వైద్య అధికారులు అందరూ కరోనా వ్యాప్తి నివారణకు పాటుపడుతున్నారని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: July 28, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading