Home /News /coronavirus-latest-news /

TELANGANA HEALTH OFFICIAL KEY PROPOSAL TO SCHOOLS SHUT DOWN DUE TO COVID SPREAD IN STUDENTS SU

Telangana: ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా.. తెలంగాణ‌లో స్కూల్స్ మూసివేతకు వైద్యశాఖ కీలక ప్రతిపాదన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 700 మంది విద్యార్థులు కరోనా బారినపడినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

    తెలంగాణలో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్స్, గురుకులాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తే మంచిందని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఒకటీ, రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించవచ్చనే అధికార వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలోని స్కూల్స్‌, గురుకులాల్లో కరోనా కేసులు నమోదవ్వడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. చాలా వరకు లక్షణాలు లేని వారికి కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

    గత కొద్ది రోజులుగా తెలంగాణలో రోజుకు 300కు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కొత్త స్ట్రెయినేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. దానిని నిర్దారణ కోసం అవసరమైన పరీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచిస్తున్నారు. . బయటకు వచ్చే సమయంలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నారు. ప్రజలు భయాన్ని వీడి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

    ఇక, దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తూ కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలు చేపట్టాయి. తెలంగాణలో మార్చి ఆరంభం వరకు పెద్దగా కేసులు నమోదు కాకపోయినప్పటికీ.. గత 20 రోజులుగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలలో పెరుగుతున్నాయి. అక్కడి నుంచి నిత్యం వేలమంది తెలంగాణకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి నుంచీ వైరస్‌ తెలంగాణలోకి వేగంగా వ్యాపిస్తోందని వైద్యశాఖ భావిస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Telangana, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు