Corona 2.0: రావొద్దనే కోరుకుంటున్నా.. కానీ అప్రమత్తంగా ఉండండి.. ఈటల రాజేందర్ కామెంట్స్

Corona 2.0: రావొద్దనే కోరుకుంటున్నా.. కానీ అప్రమత్తంగా ఉండండి.. ఈటల రాజేందర్ కామెంట్స్

ఈటల రాజేందర్ (ఫైల్)

Corona 2.0: రాష్ట్రంలో కరోనా సెకండ్ స్టేజ్ గురించి వైద్యారోగ్య శాఖ అధికారులు కొద్దిరోజులుగా తగిన సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కామెంట్స్ చేశారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దశ గుబులు పుట్టిస్తున్నది. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో పాటు యూరప్ దేశాలలో ఈ మాయదారి మహమ్మారి.. ఉత్పరివర్తనం చెంది వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో భారత్ లో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కూడా ఇటీవల యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ తరుణంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ స్టేజ్ గురించి వైద్యారోగ్య శాఖ అధికారులు కొద్దిరోజులుగా తగిన సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

    కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఉపాధిని దూరం చేసి అల్లకల్లోలం సృష్టించిన కరోనా మన దేశంలో ఫస్ట్ ఫేజ్ కింద పీక్ స్టేజ్ కు వెళ్లిందని అన్నారు. బ్రిటన్ లాంటి దేశంలో సెకండ్ వేవ్ పేరిట కరోనా విజృంభిస్తున్నదని వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే భారత ప్రభుత్వం గానీ.. తెలంగాణ ప్రభుత్వం గానీ విమానాశ్రయాలలో అలర్ట్ చేసినట్టు చెప్పారు. యూకే నుంచి వచ్చే వాళ్ళకి విమానాశ్రయాల్లోనే టెస్టులు చేసి.. ఐసోలేషన్ కి పంపడం.. పాసిటివ్ వస్తే ట్రీట్మెంట్ కి పంపుతున్నాయమని వివరించారు.

    చలికాలం ఇంకో నెల ఉంది కాబట్టి... ఈ నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మనకూ సెకండ్ వేవ్ వస్తుందని అనుకోనప్పటికీ.. శీతాకాలం కావున కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపారు. తనవరకైతే.. సెకండ్ వేవ్ రాకూడదని ఎలా తగ్గిపోయిందో అలాగే ఉండాలని కోరుకుంటున్నానని రాజేందర్ అన్నారు. ప్రజలందరూ దైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    Published by:Srinivas Munigala
    First published: