Home /News /coronavirus-latest-news /

TELANGANA HEALTH DEPT STOPS COLLECTING OF CORONA SAMPLES FOR 2 DAYS IN GHMC LIMITS BA

జీహెచ్ఎంసీపై కరోనా పంజా విసిరిన వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్ఎంసీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యాంపుల్లో రెండు రోజుల పాటు కరోనా శాంపిల్స్ తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది.

    తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాజాగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో కరోనా టెస్టులు రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్ట్ ఓ ప్రకటన విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 50వేల కరోనా టెస్టులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు 36వేల శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. అలాగే, ఆస్పత్రుల్లో కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అలా సేకరించిన శాంపిల్స్‌లో ఇంకా 8253 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఒక వ్యక్తి నుంచి కరోనా శాంపిల్ తీసుకుంటే, దాన్ని 48 గంటల లోపు పరీక్షించాలి. అప్పటి వరకు దాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి శాంపిల్స్ సేకరించడం వల్ల ల్యాబ్స్‌లో పెద్ద ఎత్తున జమ అయ్యాయి. వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారింది.

    మరోవైపు శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఎక్కువ రోజుల తర్వాత పరీక్షలు జరిపితే ఫాల్స్ పాజిటివ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాబట్టి, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న శాంపిల్స్‌ను పరీక్షించడం, ల్యాబ్స్, కలెక్షన్ సెంటర్లను శానిటైజ్ చేయడం కోసం రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాల్లో కరోనా అనుమానితుల నుంచి ఎలాంటి శాంపిల్స్ తీసుకోబోమని ప్రకటించింది. ఆస్పత్రుల్లో మాత్రం పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. కరోనా పరీక్షలు అవసరం ఉన్న వారికి నిరంతరాయంగా పరీక్షలు చేస్తామని తెలియజేసింది.
    First published:

    Tags: Coronavirus, GHMC, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు