Telangana: మరో 90 రోజులు జాగ్రత్త.. తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక

Telangana: చలికాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్‌లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు.

news18-telugu
Updated: November 4, 2020, 3:59 PM IST
Telangana: మరో 90 రోజులు జాగ్రత్త.. తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చలికాలం రావడంలో కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ పోరాటం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. చలికాలంతో పాటు పండగల సీజన్ ఉండటంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. చలికాలం వెళ్లిపోయేంతవరకు మరో 90 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రజలకు కరోనాపై అవగాహన వచ్చిందన్న శ్రీనివాసరావు.. అయినప్పటికీ ఎవరూ అజాగ్రత్తగా ఉండవద్దని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రజలు రానున్న రోజుల్లో కరోనా పట్ల అప్రమతంగా ఉండాలని సూచించారు. చలికాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్‌లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కరోనా లక్షణాలు ఉన్న వాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాకు వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుందని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలంతా భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పకుండా మాస్క్ వాడాలని సూచించారు.

గత రెండు నెలలుగా రాష్ట్రంలో కరోనా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. అందువల్లే కరోనా కేసులు తగ్గాయని అన్నారు. కరోనా పరీక్షలు మరింత పెంచుతామని తెలిపారు. కరోనా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటిసారి కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లు సైతం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. వాళ్లు బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని సూచించారు. గాంధీ హాస్పిటల్‌లో పోస్ట్ కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 4, 2020, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading