తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లందరికీ ఆరోగ్య సర్వే..

తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే హైదరాబాద్‌లోనే కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో బాధపడేవారి ఆరోగ్య సర్వే చేస్తోంది.

news18-telugu
Updated: April 15, 2020, 6:44 AM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లందరికీ ఆరోగ్య సర్వే..
రాజన్న సిరిసిల్ల జిల్లా (6), మెదక్ (9), ఆదిలాబాద్ (7), నాగర్ కర్నూలు (6), నిజామాబాద్ (6), సిద్దిపేట్ (3), భూపాలపల్లి (3), ఖమ్మం (3), ములుగు (2), జగిత్యాల (2), యాదాద్రి భువనగిరి (2), వికారాబాద్ (1), మహబూబ్ నగర్ (1), మిర్యాలగూడ (1) కొత్త కేసులు నమోదయ్యాయి.
  • Share this:
తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే హైదరాబాద్‌లోనే కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో బాధపడేవారి ఆరోగ్య సర్వే చేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. రంగంలోకి దిగిన హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం.. పేరు, వయసు, చిరునామా, ఫోన్‌ నంబరు వంటి వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. అలాంటి రోగులకు మూడు రోజులుగా ఫోన్‌ చేసి వాకబు చేస్తోంది. వారికి టెలీమెడిసిన్‌, వీడియోకాల్‌ ద్వారా సేవలు అందిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి? శ్వాస తీసుకోవడానికి కలిగే ఇబ్బందులు ఏంటి? తదితర సమాచారాన్ని తెలుసుకుంటోంది. ఏయే మందులు వాడుతున్నారు? ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా? అనే వివరాలను సేకరిస్తోంది.

నగరంలోని మొత్తం 84 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల ద్వారా కరోనా లక్షణాలతో బాధపడేవారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రోజుకు సగటున దాదాపు 100 మంది వివరాలను సేకరిస్తోంది. వీరిలో ఎవరికైనా విదేశీ ప్రయాణాలు, నిజాముద్దీన్‌ మర్కజ్‌‌ సంబంధాలున్నాయా అని ఆరా తీస్తోంది. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 52 కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్‌లోనే 40 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 15, 2020, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading