లాక్ డౌన్ 5లో సడలింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుబంధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనుండడంతో, అక్కడ ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అన్నిచోట్లా కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలతో పాటు, ప్రత్యేకించి ఎక్కడ ఎలాంటి రూల్స్ పాటించాలో కూడా స్పష్టం చేసింది.
ప్రార్థన స్థలాల వద్ద పాటించాల్సిన నిబంధనలు...
చెప్పులు పెట్టుకోవడానికి అవసరమైన స్టోరేజీ కల్పించాలి
ప్రార్థన స్థలం లోనికి వెళ్లడానికి ముందే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి
కాళ్లు, చేతులు కడుక్కునే స్థలంలో పరిశుభ్రత పాటించాలి
చిన్న ప్రదేశంలో ఎక్కువ మంది గుమిగూడడానికి వీల్లేదు
అందరూ కలసి ప్రార్థన చేసుకోవడానికి కామన్ గా ఉండే మ్యాట్లు వాడొద్దు. ‘భక్తులు’ సొంత మ్యాట్లు తెచ్చుకోవాలి
మనుషులను తాకేలా ప్రసాదం, తీర్థం లాంటివి ఇవ్వొద్దు
కమ్యూనిటీ కిచెన్లు, లంగర్లు, అన్నదాన కేంద్రాల వద్ద సామాజిక దూరం విధిగా పాటించాలి
ప్రార్థన స్థలాల వద్ద పాటించాల్సిన నియమాలు
రెస్టారెంట్ల వద్ద పాటించాల్సిన నిబంధనలు...
టేక్ అవేను ఎంకరేజ్ చేయాలి. హోమ్ డెలివరీ చేసే ముందు ఆ వ్యక్తికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఫుడ్ ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి గుమ్మం వద్ద ఉంచాలి. వారి చేతికి ఇవ్వొద్దు
సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మంది కంటే ఎక్కువ మందిని అనుమతించకూడదు
సామాజిక దూరం పాటించేలా చూడడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలి
డిస్పోజబుల్ వస్తువులు వాడడం మంచిది
క్లాత్ నేప్కిన్ల స్థానంలో పేపర్ నేప్కిన్లు వాడాలి
బఫెట్ సర్వీస్ ఉన్నచోట సామాజిక దూరం పాటించాలి
వెయిటర్లు, ఇతర స్టాఫ్ తప్పనిసరిగా మాస్క్‌లు, ఫేస్ కవర్లు ధరించాలి
కస్టమర్ వెళ్లిపోయిన తర్వాత వెంటనే ఫర్నీచర్ శానిటైజ్ చేయాలి.
మాల్స్ వద్ద కస్టమర్లు సామాజికదూరం పాటించేలా చూడడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలి
హోమ్ డెలివరీ చేయడానికి వెళ్లే ముందే డెలివరీ బాయ్‌ను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
షాపులో ఒకే సమయంలో తక్కువ మంది కస్టమర్లు ఉండేలా చూడాలి
రెస్టారెంట్లకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో అలాంటి రూల్స్ షాపింగ్ మాల్స్‌లోని ఫుడ్ కోర్టులకు వర్తిస్తాయి.
షాపింగ్ మాల్‌లో చెత్త చెదారం పడేయకూడదు
షాపింగ్ మాల్‌లో బట్టలు కొనేవాళ్లు ట్రయల్స్ వేయడానికి వీల్లేదు.
తెలంగాణ షాపింగ్ మాల్స్‌లో పాటించాల్సిన రూల్స్
హోటల్స్ పాటించాల్సిన నిబంధనలు...
హోటల్స్‌లో దిగే అతిథుల గుర్తింపు కార్డు, ట్రావెల్ హిస్టరీ, మెడికల్ కండిషన్ అన్నీ తెలుసుకోవాలి
హోటల్స్‌లో అతిథులు సామాజికదూరం పాటించేలా అవసరమైన సిబ్బందిని నియమించాలి
రిసెప్షన్ వద్ద తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచాలి
చెక్ ఇన్, చెక్ ఔట్ కోసం వీలైనంత వరకు ఆన్ లైన్ ఫామ్‌లను, చెల్లింపుల కోసం డిజిటల్ పేమెంట్లను వినియోగించాలి
అతిథులు, స్టాఫ్ కు తప్పనిసరిగా మాస్క్‌లు, ఫేస్ కవర్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి
హోటల్ నుంచి గెస్ట్ వెళ్లిపోయిన తర్వాత రూమ్ శానిటైజ్ తప్పకుండా చేయాలి
బయట రెస్టారెంట్లలో ఎలాంటి నిబంధనలు పాటిస్తారో అలాంటి రూల్స్ హోటల్స్‌ని రెస్టారెంట్లకు కూడా వర్తిస్తాయి.
రూమ్ సర్వీస్ అందించే సమయంలో సామాజిక దూరం పాటించాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.